తెలంగాణ (Telangana)లో కొత్తగా 160 కరోనా కేసులు (corona cases) నమోదవ్వగా.. వైరస్ వల్ల ఒకరు (corona deaths in telangana) ప్రాణాలు కోల్పోయారు. 148 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 3,545 యాక్టివ్‌ కేసులు వున్నాయి

తెలంగాణలో (Telangana) కరోనా కేసులు నిలకడగా కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 32,540 మంది నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 160 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కొవిడ్‌ వల్ల నిన్న ఒకరు మరణించారు. దీంతో కరోనా కారణంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య (corona deaths in telangana) 3,988కి చేరింది. వైరస్ బారి నుంచి నిన్న 148 మంది కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 3,545 యాక్టివ్‌ కేసులు (corona cases) ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. తాజా రికవరీలతో కలిపి రాష్ట్రంలో క‌రోనా వైర‌స్‌ను జ‌యించిన వారి సంఖ్య 6,67,946 కు చేరింది. అలాగే మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,75,479కి చేరుకుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 2, భద్రాద్రి కొత్తగూడెం 0, జీహెచ్ఎంసీ 66, జగిత్యాల 6, జనగామ 0, జయశంకర్ భూపాలపల్లి 0, గద్వాల 0, కామారెడ్డి 1, కరీంనగర్ 7, ఖమ్మం 21, మహబూబ్‌నగర్ 2, ఆసిఫాబాద్ 0, మహబూబాబాద్ 7, మంచిర్యాల 2, మెదక్ 0, మేడ్చల్ మల్కాజిగిరి 12, ములుగు 1, నాగర్ కర్నూల్ 1, నల్గగొండ 2, నారాయణపేట 0, నిర్మల్ 1, నిజామాబాద్ 2, పెద్దపల్లి 2, సిరిసిల్ల 1, రంగారెడ్డి 12, సిద్దిపేట 1, సంగారెడ్డి 1, సూర్యాపేట 1, వికారాబాద్ 1, వనపర్తి 2, వరంగల్ రూరల్ 1, వరంగల్ అర్బన్ 4, యాదాద్రి భువనగిరిలో 1 చొప్పున కేసులు నమోదయ్యాయి.


Scroll to load tweet…