ఇంట్లో ఒంటరిగా వున్న మైనర్ బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడిన సంఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. గత కొద్దిరోజులుగా చిన్నారిపై కన్నేసిన ఓ యువకడు ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసింది.

ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని ముదిమానిక్యం గ్రామంలో మిషన్ భగీరథ పనులు కొనసాగుతున్నాయి. ఇక్కడ జెసిబి డ్రైవర్ గా మహబూబాబాద్ జిల్లాకు ముత్తారం గ్రామానికి చెందిన ఆలకుంట శ్రీకాంత్(22) పనిచేస్తున్నాడు. అయితే పనులు జరిగే ప్రాంతానికి సమీపంలో ఓ ఇంట్లో 16 ఏళ్ల మైనర్ బాలిక తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఈమెపై శ్రీకాంత్ కన్నేసి, రోజూ బాలిక కదలికపై కన్నేసేవాడు.

ఈ క్రమంలో ఈ నెల 25న బాలిక తల్లిదండ్రులు పనులపై బైటికెళ్లగా బాలిక ఇంట్లో ఒంటరిగా ుంది. ఈ విషయాన్న గమనించిన శ్రీకాంత్ బలవంతంగా ఇంట్లోకి చొరబడి ఆమెపై బలాత్కారానికి పాల్పడ్డాడు. అయితే అతడు ఈ అఘాయిత్యం అనంతరం ఇంట్లోంచి బయటకు వస్తున్న సమయంలో బాలిక తల్లిదండ్రులు కూడా వచ్చారు. అనుమానం వచ్చి అతడిని పట్టుకోడానికి ప్రయత్నించగా తప్పించుకుని పరారయ్యాడు.

ఈ ఘటనతో తీవ్ర మనస్థాపానికి గురైన బాలిక ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించినప్పటికి ఫలితం లేకుండా పోయింది. చికిలత్స పొందుతూ యువతి మృతిచెందింది. దీనిపై తల్లిదండ్రుల యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.