జగిత్యాల జిల్లాలో రిటైర్డ్ ఎస్ఐ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి  తమ నుండి డబ్బులు వసూలు చేసి మోసం చేశారని బాధితులు హెచ్ఆర్‌సీని ఆశ్రయించారు. సుమారు 16 మంది బాధితులు హెచ్‌ఆర్‌సీలో ఫిర్యాదు చేశారు.

జగిత్యాల: జగిత్యాల జిల్లాలో రిటైర్డ్ ఎస్ఐ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి తమ నుండి డబ్బులు వసూలు చేసి మోసం చేశారని బాధితులు హెచ్ఆర్‌సీని ఆశ్రయించారు. సుమారు 16 మంది బాధితులు హెచ్‌ఆర్‌సీలో ఫిర్యాదు చేశారు.

జగిత్యాల జిల్లాలో రిటైర్్ ఎస్ఐ చంద్రమౌళి రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి తమను మోసం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సమయంలో తనకున్న పరిచయాల ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి తమ వద్ద నుండి డబ్బులు వసూలు చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు.

ఒక్కొక్కరి నుండి రూ. 13 లక్షలు ఆరోపించారని బాధితులు హెచ్ఆర్సీకి ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడ స్థానిక పోలీసులు పట్టించుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు.తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధితులు ఆధారాలతో హెచ్ఆర్‌సీకి ఫిర్యాదుచేశారు.

ఉద్యోగాల పేరుతో మోసం చేసే వారి పట్ల ప్రభుత్వం, అధికారులు తరచూ హెచ్చరిస్తున్నా కూడ నిరుద్యోగులు పట్టించుకోవడం లేదు. పోలీసు ఉద్యోగంలో ఉన్న వ్యక్తి చెప్పిన మాటలను నమ్మి డబ్బులిచ్చి మోసపోయారు యువకులు. ఇప్పుడు హెచ్ఆర్సీ ని ఆశ్రయించారు.