తెలంగాణ: 24 గంటల్లో 147 మందికి కరోనా పాజిటివ్.. 6,75,148కి చేరిన కేసుల సంఖ్య

తెలంగాణ (Telangana)లో కొత్తగా 147 కరోనా కేసులు (corona cases) నమోదవ్వగా.. వైరస్ వల్ల ఒకరు (corona deaths in telangana) ప్రాణాలు కోల్పోయారు. 148 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 3,986 యాక్టివ్‌ కేసులు వున్నాయి.
 

147 new corona cases reported in telangana

తెలంగాణలో (Telangana) గడిచిన 24 గంటల్లో 33,836 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 147 కొత్త కేసులు (corona cases) నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 56 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. రంగారెడ్డి జిల్లాలో 12, కరీంనగర్ జిల్లాలో 11 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 148 కరోనా నుంచి కోలుకున్నారు. ఒకరు ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా బారినపడిన వారి సంఖ్య 6,75,148 చేరుకుంది. 6,67,631 మంది కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 3,531 యాక్టీవ్ కేసులు వున్నాయి. తాజా మరణంతో కలిపి రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 3,986కి (corona deaths in telangana) చేరుకుంది.

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 3, భద్రాద్రి కొత్తగూడెం 7, జీహెచ్ఎంసీ 56, జగిత్యాల 1, జనగామ 0, జయశంకర్ భూపాలపల్లి 0, గద్వాల 0, కామారెడ్డి 1, కరీంనగర్ 11, ఖమ్మం 5, మహబూబ్‌నగర్ 1, ఆసిఫాబాద్ 1, మహబూబాబాద్ 3, మంచిర్యాల 2, మెదక్ 2, మేడ్చల్ మల్కాజిగిరి 5, ములుగు 0, నాగర్ కర్నూల్ 0, నల్గగొండ 6, నారాయణపేట 0, నిర్మల్ 0, నిజామాబాద్ 3, పెద్దపల్లి 5, సిరిసిల్ల 1, రంగారెడ్డి 12, సిద్దిపేట 3, సంగారెడ్డి 1, సూర్యాపేట 3, వికారాబాద్ 3, వనపర్తి 3, వరంగల్ రూరల్ 1, వరంగల్ అర్బన్ 9, యాదాద్రి భువనగిరిలో 1 చొప్పున కేసులు నమోదయ్యాయి.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios