తెలంగాణలో 47 వేలు దాటిన కరోనా: కొత్తగా 1,430 కేసులు.. ఏడుగురి మృతి
తెలంగాణలో కరోనా విలయతాండవం కొనసాగుతూనే ఉంది. తాజాగా మంగళవారం కొత్తగా 1,430 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 47,705కి చేరింది
తెలంగాణలో కరోనా విలయతాండవం కొనసాగుతూనే ఉంది. తాజాగా మంగళవారం కొత్తగా 1,430 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 47,705కి చేరింది. ఇవాళ వైరస్‌తో ఏడుగురు మరణించడంతో మృతుల సంఖ్య 429కి చేరుకుంది.
ఒక్క హైదరాబాద్‌లోనే 703 మందికి పాజిటివ్‌గా తేలగా.. రంగారెడ్డి 117, మేడ్చల్‌లలో 105 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కొత్తగా 16,855 మందికి కరోనా టెస్టులు చేయడంతో వీటి సంఖ్య 2 లక్షల 93 వేల 77 మందికి పరీక్షలు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 10,891 యాక్టివ్ కేసులు ఉండగా.. 36,385 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
Also Read:షాక్: పరీక్ష చేయకుండానే కరోనా పాజిటివ్ అంటూ మహిళకు మేసేజ్
కాగా, కరోనా పరీక్షలు చేయించుకోకుండానే ఓ మహిళకు కరోనా సోకినట్టుగా వైద్య శాఖ నుండి సమాచారం రావడంతో ఆ మహిళ షాక్‌కు గురైంది. పరీక్షలు చేయించుకోకుండానే కరోనా ఎలా నిర్ధారించారని ఆ మహిళ ప్రశ్నిస్తోంది.
రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్ లో కరోనా పరీక్షలు చేయించుకొనేందుకు ఓ మహిళ సోమవారం నాడు ఆసుపత్రి వద్దకు వెళ్లింది. ఈ మహిళ కరోనా పరీక్షల కోసం తన వంతు కోసం ఎదురు చూసింది. అయితే ఆమె వంతు కోసం వచ్చేసరికి కరోనా పరీక్షలు నిర్వహించే కిట్స్ అయిపోయాయి. ఇదే విషయాన్ని ఆమెకు వైద్య సిబ్బంది చెప్పారు.
Also Read:మైనర్ బాలికపై అత్యాచారం.. నిందితులకు కరోనా
కిట్స్ లేకపోవడంతో ఆ మహిళ ఆసుపత్రి నుండి తిరిగి ఇంటికి వచ్చింది. అయితే ఆమె ఇంటికి వచ్చిన తర్వాత ఆమెకు కరోనా సోకిందని వైద్య సిబ్బంది నుండి సమాచారం వచ్చింది. దీంతో ఆమె షాకైంది. తనకు పరీక్షలు నిర్వహించకుండానే తనకు ఎలా కరోనా సోకిందని నిర్ధారించారని ఆమె ప్రశ్నించింది.