మైనర్ బాలికపై కొందరు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. కాగా... ఈ ఘటనకు సంబంధించి నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే.. నిందితులకు కరోనా పాజిటివ్ గా తేలిందని పోలీసులు చెప్పారు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉద్యోగం కోసం చూస్తున్న ఓ మైనర్ బాలికకు.. తాను ఆ భోరసా కల్పిస్తానంటూ అనిత అనే యువతి నమ్మబలికింది. ఆ తర్వాత మోసం చేసి కామాంధులకు ఆ బాలికను వదిలేసింది. కాగా.. ఈ కేసులో 13 మందిని నిందితులుగా  గుర్తించామని అందులో 12 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు. ఉద్యోగం పేరుతో మైనర్ బాలికను అనిత అనే యువతి ట్రాప్ చేసిందని ఎస్పీ పేర్కొన్నారు.

నిందితులపై పోక్సో చట్టం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని నిందితులలో నలుగురు ఆటో డ్రైవర్లు ఉన్నారని తెలిపారు. నిందితులలో ఒకరే మైనర్‌ కాగా నిందితులకు కరోనా పాజిటీవ్ ఉన్నట్లు వెల్లడించారు. అమ్మాయిలను నమ్మి ఎవరితోనూ పంపవద్దని తల్లిద్రండ్రులకు సూచించారు.