ఐదో అంతస్థు నుండి పడి 14 ఏళ్ల వర్ష మృతి, ఏమైంది?

First Published 8, Jul 2018, 2:57 PM IST
14 year old Varsha died in Hyderabad
Highlights

హైద్రాబాద్ అల్వాల్ జేజే నగర్‌లోని ఐదో అంతస్థు నుండి 14 ఏళ్ల వర్ష అనే బాలిక కిందపడి మృతి చెందింది. స్కూల్‌కు సెలవు కావడంతో అమ్మమ్మ ఇంటికి వచ్చిన బాలిక మృత్మువాత పడింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్: హైద్రాబాద్‌ అల్వాల్ జేజే నగర్‌లో విషాదం చోటు చేసుకొంది. 14 ఏళ్ల వర్ష అనే బాలిక ఓ భవనం ఐదో అంతస్థు నుండి కింద పడి చనిపోయింది.  ఈ బాలిక మరణాన్ని పోలీసులు అనుమానాస్పదస్థితి కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

శనివారం నాడు సెలవు కావడంతో అమ్మమ్మ ఇంటికి వచ్చింది వర్ష.  అయితే  భవనం ఐదో అంతస్థు నుండి ఆ బాలిక ఎలా కిందపడిందనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రమాదవశాత్తు ఆ బాలిక  కిందపడిపోయిందా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బాలిక మృతదేహాన్ని పోలీసులు పోస్ట్‌మార్టం కోసం తరలించారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో బాలిక మృతికి గల కారణాలు తెలిసే అవకాశాలున్నాయని పోలీసులు చెబుతున్నారు.

ఈ ఘటనకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు. సెలవుల్లో ఎంజాయ్ చేసేందుకు వచ్చి వర్ష మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

హైదరాబాద్‌లోని అల్వాల్‌ జేజే నగర్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. 14 ఏళ్ల వర్ష అనే బాలిక ఓ భవన ఐదో అంతస్తు పై నుంచి కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అల్వాల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నిమిత్తం బాలిక మృతదేహాన్ని సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈరోజు స్కూలుకి సెలవు కావడంతో నిన్న సాయంత్రం వర్ష తన అమ్మమ్మ ఇంటికి వచ్చింది. వర్ష అనుమానాస్పద మృతి ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.   

loader