తెలంగాణ (Telangana)లో కొత్తగా 135 కరోనా కేసులు (corona cases) నమోదవ్వగా.. వైరస్ వల్ల ఒకరు (corona deaths in telangana) మరణించారు. 168 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 3,947 యాక్టివ్‌ కేసులు వున్నాయి.

తెలంగాణలో (Telangana) గడచిన 24 గంటల్లో 26,842 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 135 మందికి (corona cases) పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. జీహెచ్ఎంసీలో అత్యధికంగా 64 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 11 కేసులు గుర్తించారు. వనపర్తి, వికారాబాద్, నిజామాబాద్, నిర్మల్, నారాయణపేట, ములుగు, కొమరంభీం ఆసిఫాబాద్, కామారెడ్డి, జోగులాంబ గద్వాల్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, ఆదిలాబాద్ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

అదే సమయంలో 168 మంది కోవిడ్ మహమ్మారి నుంచి కోలుకోగా, ఒకరు ప్రాణాలు (corona deaths in telangana) కోల్పోయారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 6,70,274కి చేరుకుంది. ఇప్పటి వరకు తెలంగాణలో 6,62,377 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,950 యాక్టీవ్ కేసులు వున్నాయి. తాజా మరణాలతో కలిపి తెలంగాణలో కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3,947కి చేరుకుంది. 

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 0, భద్రాద్రి కొత్తగూడెం 5, జీహెచ్ఎంసీ 64, జగిత్యాల 3, జనగామ 0, జయశంకర్ భూపాలపల్లి 0, గద్వాల 0, కామారెడ్డి 0, కరీంనగర్ 9, ఖమ్మం 8, మహబూబ్‌నగర్ 2, ఆసిఫాబాద్ 0, మహబూబాబాద్ 3, మంచిర్యాల 1, మెదక్ 1, మేడ్చల్ మల్కాజిగిరి 4, ములుగు 0, నాగర్ కర్నూల్ 1, నల్గగొండ 4, నారాయణపేట 0, నిర్మల్ 0, నిజామాబాద్ 0, పెద్దపల్లి 1, సిరిసిల్ల 1, రంగారెడ్డి 11, సిద్దిపేట 3, సంగారెడ్డి 4, సూర్యాపేట 5, వికారాబాద్ 0, వనపర్తి 0, వరంగల్ రూరల్ 1, వరంగల్ అర్బన్ 3, యాదాద్రి భువనగిరిలో 1 చొప్పున కేసులు నమోదయ్యాయి.

Scroll to load tweet…