కూతురిపై బాబాయ్ అత్యాచారం చేయడంతో ఆ చిన్నారి గర్భవతైన దారుణ సంఘటన మహబూబాబాద్ జిల్లా కురవిలో జరిగింది. కురవి మండలంలోని ఓ తండాకు చెందిన పదమూడేళ్ల అమ్మాయి వేరే ఊర్లో ఉంటూ చదువుకుంటోంది. కరోనా వల్ల స్కూల్స్ లేకపోవడంతో ఇంటి దగ్గరే ఉంటోంది. 

ఇదే తండాకు చెందిన బాబాయ్ వరసయ్యే వ్యక్తి ఆమెపై కన్నేశాడు. మభ్యపెట్టి అత్యాచారం చేశాడు. భయపడ్డ చిన్నారి తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పలేదు. మంగళవారం ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోవడంతో తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన డాక్టర్లు బాలిక గర్భవతని తేల్చారు.

షాక్ కు గురైన తల్లిదండ్రులు అమ్మాయిని అడిగితే చెప్పలేదు. గట్టిగా నిలదీయంతో అసలు విషయం చెప్పింది. బాబాయ్ వరసయ్యే వ్యక్తి తనను లోబరుచున్నాడని చెప్పడంతో వెంటనే తల్లిదండ్రులు అతని మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న కురవి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.