Asianet News TeluguAsianet News Telugu

సిద్దిపేట జిల్లాలో కలుషిత ఆహారం తిని 128 మందికి అస్వస్థత

కలుషిత ఆహారం తీసుకుని సిద్దిపేట లోని మైనారిటీ గురుకుల స్కూల్ లో 128 మంది విద్యార్ధినులు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన విద్యార్ధినులను ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్ధులను ఉన్నతాధికారులు పరామర్శించారు

128 Minority residential school students admitted  to Hospital After Eating  Food
Author
Hyderabad, First Published Jun 27, 2022, 7:56 PM IST

సిద్దిపేట: కలుషిత ఆహారం తీసుకుని 128 మంది Students అస్వస్థతకు గురయ్యారు. Siddipet లోని ప్రభుత్వ మైనారిటీ Residential  స్కూల్ లో ఈ ఘటన సోమవారం నాడు చోటు చేసుకుంది. ఈ స్కూల్లో 326 మంది విద్యార్ధినులున్నారు.  ఆదివారం నాడు మధ్యాహ్నం విద్యార్ధులకు Chicken తో భోజనం వడ్డించారు. చికెన్ గ్రేవిని రాత్రిపూట వంకాయతో కలిపి వండారు. దీంతో ఆదివారం నాడు రాత్రి భోజనం చేసిన తర్వాత నుండి విద్యార్ధినులు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన విద్యార్ధినులను ఆసుపత్రికి తరలించారు.ఈ విషయం తెలిసిన వెంటనే ఉన్నతాధికారులు ఆసుపత్రికి చేరుకుని విద్యార్ధులను పరామర్శించారు. 

ఆదిలాబాద్ జిల్లాలోని భీంపూర్ కేజీబీవీలోని 70 మంది విద్యార్థులు ఒక్క సారిగా అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు.  ఈ ఘటన ఈ ఏడాది మార్చి 13న  చోటు చేసుకుంది.  ఫుడ్ పాయిజ‌న్ వల్లే విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారని   డాక్ట‌ర్లు నిర్దారించారు.  ఆదిలాబాద్ జిల్లాలోని భీంపూర్ కేజీబీవీ ప‌ట్ట‌ణంలోని ఎన్టీఆర్ చౌక్ లో కొన‌సాగుతోంది. ఇది రిమ్స్ హాస్పిట‌ల్ కు కొంచెం దూరంలోనే ఉంది. ఇందులో ఆరో త‌ర‌గ‌తి విద్యార్థుల నుంచి ఇంట‌ర్ చ‌దివే పిల్ల‌ల వ‌ర‌కు ఉంటారు.  భోజ‌నంలో అన్నం, వంకాయ‌, పంపు తిన్నారు. అయితే అర్ధ‌రాత్రి నుంచి పిల్ల‌లు అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. నీళ్ల విరేచ‌నాలు, వాంతులు అయ్యాయి. ఈ విష‌యాన్ని విద్యార్థులు స్థానికంగా ఉన్న సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి దాదాపు 35 మంది పిల్ల‌ల‌ను రిమ్స్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. మిగిలిన విద్యార్థుల‌కు కేజీబీవీలోనే క్యాంప్ ఏర్పాటు చేసి చికిత్స అందించారు. 

ఈ విష‌యం తెలుసుకున్న ఆదిలాబాద్ క‌లెక్ట‌ర్ సిక్తా ప‌ట్నాయ‌క్ వెంట‌నే స్పందించారు. వెంట‌నే విద్యార్థుల‌కు మెరుగైన చికిత్స అందించాల‌ని ఆదేశించారు. కేజీబీవీని సంద‌ర్శించారు. అక్క‌డ ఉన్న ప‌రిస్థితుల‌ను తెలుసుకున్నారు. విద్యార్థుల స‌మ‌స్య‌లు విన్నారు. తాగేందుకు, స్నానం చేసేందుకు అవే నీటిని ఉప‌యోగిస్తున్నామ‌ని పిల్ల‌లు క‌లెక్ట‌ర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనికి అస‌వ‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను క‌లెక్ట‌ర్ ఆదేశించారు. ఈ ఘ‌ట‌నకు కార‌ణ‌మైన వారిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు

ఇలాంటి ఘ‌ట‌న‌లు త‌ర‌చూ జ‌రుగుతుండ‌టంతో విద్యార్థులు త‌ల్లిదండ్రులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. నాసిర‌కమైన కూర‌గాయ‌లు, ఇత‌ర వ‌స్తువుల‌తో భోజ‌నం త‌యారు చేస్తుండ‌టం, వంట చేసే ప్ర‌దేశంలో అప‌రిశుభ్ర వాతావ‌ర‌ణం ఉండ‌టం, అధికారులు ప‌ర్య‌వేక్ష‌ణ లోపంతోనే ఇలాంటి ఘ‌ట‌ను పునార‌వృతం అవుతున్నాయ‌ని త‌ల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇక‌నైనా ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా చూడాల‌ని కోరుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios