Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో బర్డ్ ఫ్లూ కలకలం..120కోళ్లు మృతి

సారయ్య కొన్ని నెలలుగా నాటు కోళ్లు పెంచి విక్రయిస్తూ జీననోపాధి పొందుతున్నాడు. రెండు రోజుల వ్యవధిలోనే అవి మృతి చెందడంతో దాదాపు రూ.లక్ష మేరకు నష్టపోయినట్లు తెలిపారు. 

120 chickens died in Warangle, suspecting Bird flue
Author
Hyderabad, First Published Jan 8, 2021, 9:44 AM IST


దేశంలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. ఇప్పటికే..  ఐదు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ తీవ్ర రూపం దాల్చింది. మధ్యప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో.. అక్కడ హై అలర్ట్ కూడా ప్రకటించారు. కాగా.. తాజాగా.. తెలంగాణ రాష్ట్రంలోనూ దీని ప్రభావం కనపడుతోంది.

వరంగల్‌ అర్బన్‌ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పూర్‌కు చెందిన గద్ద సారయ్యకు చెందిన 120 నాటు కోళ్లు మృత్యువాత పడ్డాయి. సారయ్య కొన్ని నెలలుగా నాటు కోళ్లు పెంచి విక్రయిస్తూ జీననోపాధి పొందుతున్నాడు. రెండు రోజుల వ్యవధిలోనే అవి మృతి చెందడంతో దాదాపు రూ.లక్ష మేరకు నష్టపోయినట్లు తెలిపారు. 

చనిపోయిన కోళ్లను మండల పశువైద్యాధికారి మాలతి పరిశీలించారు. నమూనాలను పరీక్ష నిమిత్తం వరంగల్‌ ప్రాంతీయ పశు వైద్యశాలకు, అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. కాగా, పలు రాష్ట్రాల్లో బర్డ్‌ ఫ్లూ సోకుతుందనే ప్రచారం నేపథ్యంలో ఒకేసారి భారీ సంఖ్యలో కోళ్లు చనిపోవడం కలకలం రేపుతోంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios