Asianet News TeluguAsianet News Telugu

గచ్చిబౌలిలో పేకాట శిబిరం గుట్టురట్టు.. 12మంది రియల్ ఎస్టేట్ వ్యాపారుల అరెస్ట్..

శిబిరం మీద దాడి చేసిన మాదాపూర్ ఎస్ వోటీ పోలీసులు పాపిరెడ్డి (అల్వాల్), కార్తీక్ గౌడ్, సంతోష్ (ఎల్బీనగర్), సతీష్ (సంతోష్ నగర్), సీర్ల రెడ్డి (సిద్దిపేట), రామయ్య (మెదక్), వెంకట నర్సింహరాజు(అల్వాల్), సద్గురురెడ్డి (బీరంగూడ), కృష్ణ (బీరంగూడ), అప్పలరాజు (గండిపేట)లను అదుపులోకి తీసుకున్నారు. అంబర్ పేట కు చెంది మర్కారెడ్డి గచ్చిబౌలిలో ఫ్లాట్ అద్దెకు తీసుకుని పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

12 real estate traders arrested in Gatchibauli poker camp
Author
Hyderabad, First Published Jan 22, 2022, 1:19 PM IST

హైదరాబాద్ : నగరంలోని Gachibowliలో Poker camp గుట్టు రట్టైంది. పేకాట ఆడుతున్న 12మంది Real estate traderలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ. 9 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. శిబిరం మీద దాడి చేసిన మాదాపూర్ ఎస్ వోటీ పోలీసులు పాపిరెడ్డి (అల్వాల్), కార్తీక్ గౌడ్, సంతోష్ (ఎల్బీనగర్), సతీష్ (సంతోష్ నగర్), సీర్ల రెడ్డి (సిద్దిపేట), రామయ్య (మెదక్), వెంకట నర్సింహరాజు(అల్వాల్), సద్గురురెడ్డి (బీరంగూడ), కృష్ణ (బీరంగూడ), అప్పలరాజు (గండిపేట)లను అదుపులోకి తీసుకున్నారు. అంబర్ పేట కు చెంది మర్కారెడ్డి గచ్చిబౌలిలో ఫ్లాట్ అద్దెకు తీసుకుని పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

డిసెంబర్ 19న మేడ్చల్ జిల్లా కీసరలో ఏడుగురు పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు పోలీసులు. ఓ రిసార్ట్ రూమ్‌లో పేకాట ఆడుతుండగా పోలీసులు దాడి చేశారు. వారి వద్ద నుంచి రూ.65 వేలు, 5 మొబైల్స్, పేకాట కార్డులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో అధికార టీఆర్ఎస్‌కు (trs) చెందిన మహిళా కార్పోరేటర్ల భర్తలు వున్నారు. దీంతో పోలీసులకు రాజకీయ నేతల నుంచి ఫోన్లు వస్తున్నట్లుగా తెలుస్తోంది. జవహర్ నగర్ కార్పోరేషన్ మూడవ డివిజన్ కార్పోరేటర్ భర్త బల్లి శ్రీనివాస్, నాలుగో డివిజన్ కార్పోరేటర్ భర్త మరుగొని వెంకటేశ్, 9వ డివిజన్ కార్పోరేటర్ భర్త మనోధర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

ఇదిలా ఉండగా, నవంబర్ లో రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మంచిరేవుల ఫామ్‌హౌస్‌లో పేకాట కేసులో సినీ నటుడు నాగశౌర్య తండ్రి శివలింగప్రసాద్ ను  పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఏడాది అక్టోబర్ 31న రాత్రి మంచిరేవులలోని హీరో నాగశౌర్య ఫామ్ హౌస్ లో పేకాట ఆడుతున్నవిషయమై సమాచారం అందుకొన్న పోలీసులు దాడులు చేశారు.  ప్రధాన నిందితుడు సుమన్ సహా 30 మందిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

సుమన్ తో కలిసి శివలింగప్రసాద్ ఈ ఫామ్ హౌస్ లో పేకాట నిర్వహిస్తున్నారని పోలీసులు గుర్తించారు. దీంతో ఇవాళ శివలింగ ప్రసాద్  పోలీసులు అరెస్ట్ చేసి ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరుపర్చారు. పుట్టినరోజు వేడకల కోసం సుమన్ ఈ ఫామ్‌హౌస్ ను అద్దెకు తీసుకొన్నాడు.ఈ ఫామ్ హౌస్ లో పేకాట  ఆడుతున్నారని కచ్చితమైన సమాచారం మేరకు Sot పోలీసులు ఈ ఫామ్ హౌస్ పై దాడి చేశారు. పేకాట ఆడుతూ మాజీ ఎమ్మెల్యే శ్రీరాం భద్రయ్య సహా పలువురు  పోలీసులకు చిక్కారు. గుత్తా సుమన్ కుమార్ ఈ పేకాట నిర్వహిస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలువురు ప్రముఖులు, వీఐపీలు, రాజకీయ నేతలతో సుమన్ కు సంబంధాలున్నాయని  దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. 

పేకాట ఆడేవారి కోసం సుమన్ కుమార్ ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేశాడు. ఈ వాట్సాప్ గ్రూపుల ద్వారా పేకాట ఎక్కడ ఆడుతారోననే విషయమై సుమన్ కుమార్ సమాచారం చేరవేసేవాడు. డిజిటల్ రూపంలో డబ్బులను తీసుకొనేవాడు. ఈ డబ్బులను తీసుకొన్న తర్వాత సుమన్ కుమార్ కాయిన్స్ ను ఇచ్చేవాడని పోలీసులు చెబుతున్నారు.ఈ నెల మొదటి వారంలో రెండు రోజుల పాటు గుత్తా సుమన్ కుమార్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించారు.

Follow Us:
Download App:
  • android
  • ios