తెలంగాణలో (omicron cases in telangana) శనివారం కొత్తగా 12 ఒమిక్రాన్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 20కి చేరింది. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన 10 మందికి కొత్తగా ఈ వేరియంట్ నిర్థారణ అయినట్లు అధికారులు తెలిపారు. 

దక్షిణాఫ్రికాలో (south africa) పుట్టిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (omicron) ప్రపంచాన్ని వణికిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మనదేశంలోకి అడుగుపెట్టిన ఈ వైరస్ (coronavirus) మరింత విస్తరిస్తోంది. తెలుగు రాష్ట్రాలను సైతం ఈ మహమ్మారి భయపెడుతోంది. తాజాగా తెలంగాణలో (omicron cases in telangana) శనివారం కొత్తగా 12 ఒమిక్రాన్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 20కి చేరింది. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన 10 మందికి కొత్తగా ఈ వేరియంట్ నిర్థారణ అయినట్లు అధికారులు తెలిపారు. వీరిలో రిస్క్ దేశాల నుంచి తెలంగాణకు వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ వచ్చినట్లు పేర్కొన్నారు. 

మరోవైపు క‌రోనా వైర‌స్ కేసులు స్వ‌ల్పంగా పెరుగుతూ.. అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండ‌టంపై కేంద్ర ఆరోగ్య శాఖ (ministry of health and family welfare) ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ఈ క్ర‌మంలోనే ప‌లు హెచ్చరిక‌లు చేస్తూ.. క‌రోనా మార్గ‌ద‌ర్శ‌కాలు పాటించాల‌నీ, జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించింది. భార‌త్ లో ఇప్ప‌టివ‌ర‌కు 11 రాష్ట్రాల్లో 100కు పైగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు బయటపడ్డాయని వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ‌.. ప్రస్తుతం యూప‌ర్ దేశాలైన బ్రిటన్‌, ఫ్రాన్స్‌ తరహా పరిస్థితులు భారత్‌లోనూ ఏర్ప‌డితే దారుణ ప‌రిస్థితులు ఉంటాయ‌ని తెలిపింది. 

Also Read:Omicron | అదే జరిగితే రోజుకు 14 లక్షల కేసులు.. ఒమిక్రాన్‌పై కేంద్రం హెచ్చరికలు

దీనిపై కోవిడ్ టాస్క్ ఫోర్స్ చీఫ్ డాక్ట‌ర్ వీకే పాల్ మాట్లాడుతూ.. నిత్యం ల‌క్ష‌ల్లో కేసులు వెలుగుచూసే అవ‌కాశ‌ముంద‌ని అన్నారు. యూకే తరహా పరిస్థితులు ఏర్పడితే భారత్‌లో రోజుకు 14 లక్షలకు పైగా క‌రోనా వైరస్ కేసులు న‌మోద‌వుతాయ‌ని తెలిపారు. అలాగే, ఫ్రాన్స్‌లా ప‌రిస్థితులు మారితే రోజుకు 13 లక్షల కేసులు వెలుగుచూస్తాయ‌ని వెల్ల‌డించ‌డంపై ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. "యూకేలో క‌రోనా వ్యాప్తి ని పరిశీలిస్తే.. అక్క‌డి ప‌రిస్థితులు భారత్‌లో ఏర్ప‌డితే.. మన జనాభాను బట్టి ప్రతిరోజూ 14 లక్షల క‌రోనా కేసులు నమోదవుతాయి..

ఫ్రాన్స్‌లో రోజుకు 65,000 కేసులు బయటపడుతున్నాయి.. అదే స్థాయిలో వ్యాప్తి చెందితే భారత్‌లో మన జనాభాను బట్టి ప్రతిరోజూ 13 లక్షల కేసులు నమోదవుతాయి" అని వీకే పాల్ వెల్ల‌డించారు. అలాగే, యూకేలో రోజువారీ కేసుల్లో కొత్త రికార్డులు నమోదవుతున్నాయ‌నీ, వైర‌స్ వ్యాప్తి అత్యంత వేగంగా ఉంద‌ని తెలిపారు. శుక్రవారం ఒక్క‌రోజే అక్కడ 88,042 మంది కొత్తగా వైరస్ బారినపడడగా.. వీటిలో ఒమిక్రాన్ కేసులు 2.4 శాతంగా ఉన్నాయ‌ని వీకే పాల్ వెల్ల‌డించారు.