మహబూబ్‌నగర్ జిల్లాలో కల్తీ కల్లు తాగి పది మంది అస్వస్థతకు గురికావడం కలకలం రేపుతోంది.  దొడ్లోనిపల్లి, కోయనగర్, మోతీనగర్‌లలో కల్తీ కల్లు దందా జరుగుతోంది

మహబూబ్‌నగర్ జిల్లాలో కల్తీ కల్లు తాగి పది మంది అస్వస్థతకు గురికావడం కలకలం రేపుతోంది. కల్లు తాగిన వారంతా పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. క్లోరోఫామ్‌తో కల్తీ కల్లు తయారు చేసినట్లుగా తెలుస్తోంది. దొడ్లోనిపల్లి, కోయనగర్, మోతీనగర్‌లలో కల్తీ కల్లు దందా జరుగుతోంది. ఎక్సైజ్ అధికారుల కనుసన్నల్లోనే అమ్మకాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు బాధితులను ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.