ప్రజలను కేంద్రం బాగానే బకరాలను చేసాననుకుంటోంది. ఏం చేస్తాం. మరో రెండున్నరేళ్లు తప్పదు. మోడి ఏమి చేసినా భరించాల్సిందే.

ప్రజలను కేంద్రప్రభుత్వం వెర్రి వాళ్ళనుకుంటోందో ఏమిటో అర్ధం కావటం లేదు. దేశంలో నెలకొన్న సంక్షోభం ఏమిటి? ప్రధానమంత్రి దేశప్రజలకు వేసిన ప్రశ్నలు ఏమిటి? కావాలంటే మీరే చదవండి.

1. భారతదేశంలో నల్లధనం ఉందని మీరు భావిస్తున్నారా?

ఎ. అవును బి. కాదు

2. అవినీతి మరియు నల్లధనం అనే దుష్ట శక్తులపై పోరాటం జరపవలసిన, మరియు వాటిని నాశనం చేయవలసిన అవసరం ఉందని మీరు అనుకొంటున్నారా?

ఎ. అవును బి. కాదు

3. మొత్తంమీద, నల్లధనాన్ని ఎదిరించి పోరాడడానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలను గురించి మీరు ఏమనుకొంటున్నారు?

4. నల్లధనానికి వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వం ఇంతవరకు చేసిన ప్రయత్నాల విషయంలో మీరు ఏమంటారు?

విశిష్టమైంది, చాలా మంచిది, మంచిది, సరే, వ్యర్థమైంది

5. పాత రూ.500, రూ.1000 నోట్లను నిషేధిస్తూ మోదీ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయంపై మీరు ఏమనుకొంటున్నారు?

ఎ. సరైన దిశగా తీసుకొన్న గొప్ప నిర్ణయం బి. మంచి నిర్ణయం

సి. ఎటువంటి వ్యత్యాసాన్ని చూపదు

6. నల్లధనాన్ని, అవినీతిని మరియు ఉగ్రవాదాన్ని నిరోధించడంలో నోట్ల రద్దు తోడ్పడుతుందని మీరు భావిస్తున్నారా?

ఎ. ఇది తక్షణ ప్రభావాన్ని చూపగలుగుతుంది.

బి. మధ్య కాలం నుండి దీర్ఘ కాలంలో ప్రభావం ఉండగలదు.

సి. కనీస ప్రభావం ఉంటుంది. డి. తెలియదు

7. నోట్ల రద్దు స్థిరాస్తి, ఉన్నత విద్య, ఆరోగ్య సంరక్షణ లను సామాన్య మానవుడి అందుబాటులోకి తీసుకురాగలుగుతుంది.

ఎ. పూర్తిగా అంగీకరిస్తాను బి. కొంతవరకు అంగీకరిస్తాను సి. చెప్పలేను

8. అవినీతి, నల్లధనం, ఉగ్రవాదం మరియు నకిలీ కరెన్సీ తయారీలపై మన పోరాటం వల్ల మీకు కలిగే అసౌకర్యం పట్ల మీకు అభ్యంతరం ఉందా?

ఎ. ఎంతమాత్రం లేదు బి. కొంతవరకు ఉంది, కానీ దాని వల్ల కొంత మేలు జరగగలదు, సి. అవును

9. అవినీతి వ్యతిరరేక కార్యకర్తలు ప్రస్తుతం నిజానికి నల్లధనం, అవినీతి మరియు ఉగ్రవాదాలకు మద్దతుగా పోరాడుతూ ఉన్నారని మీరు నమ్ముతున్నారా?

ఎ. అవును బి. కాదు

10. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తో పంచుకోవాలని మీరు అనుకుంటున్న ఏవైనా సలహాలు, ఉపాయాలు లేదా అంతర్ దృష్టి వంటివి మీ వద్ద ఉన్నాయా?

ప్రస్తుతం దేశంలో నెలకొన్న సంక్షోభానికి క్రింద అడిగిన ప్రశ్నలకు ఏమన్నా సంబంధం ఉందా? చెలామణిలో ఉన్న పెద్ద నట్లను అర్ధాంతరంగా రద్దు చేసిన కారణంగా తలెత్తిన సమస్యలపై ఒక్క ప్రశ్నైనా ఉందా. చిన్న నోట్ల చాలమణి లేక, పెద్ద నోట్ల రద్దు చేయటంతో ఏర్పడిన సమస్య గురించి ప్రశ్నమాత్రం లేదు.

దేశంలో నల్లధనం లేదని ఎవరైనా చెప్పారా? వెలికి తీయొద్దని ఎవరన్నాఅన్నారా? నల్లధనం, నకిలీ నోట్ల ఏరివేత పేరుతో మోడి తీసుకున్న నిర్ణయం, అమలుపైనే ఇపుడు దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. దానికి సంబంధించిన ప్రశ్న ఒక్కటైనా ఉందా? మొత్తం మీద ప్రజలను కేంద్రం బాగానే బకరాలను చేసాననుకుంటోంది. ఏం చేస్తాం. మరో రెండున్నరేళ్లు తప్పదు. మోడి ఏమి చేసినా భరించాల్సిందే.