మహిళలకు తులం బంగారం.. విద్యార్థులకు ఉచిత ఇంట‌ర్నెట్ : కాంగ్రెస్ మేనిఫెస్టోలో మ‌రిన్ని హామీలు

Telangana Congress: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కాంగ్రెస్ మేనిఫెస్టోను కేసీఆర్ కాపీ కొట్టారని ఆ పార్టీ ఆరోపించింది. రూ.4 వేల పింఛన్ ఇస్తామని హామీ ఇస్తే కేసీఆర్ పార్టీ భారత రాష్ట్ర సమితి దాన్ని రూ.5 వేలకు పెంచిందని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో వివాహ స‌మ‌యంలో మ‌హిళ‌ల‌కు 10 గ్రాముల బంగారం, ఉచిత ఇంటర్నెట్ వంటి అంశాల‌ను కూడా చేర్చ‌నున్న‌ట్టు టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ డి.శ్రీధర్ బాబు పేర్కొన్నారు. 
 

10 grams of gold for women. Free internet for students: More promises made in Congress manifesto, D. Sridhar Babu RMA

Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కాంగ్రెస్ మేనిఫెస్టోను కేసీఆర్ కాపీ కొట్టారని ఆ పార్టీ ఆరోపించింది. రూ.4 వేల పింఛన్ ఇస్తామని హామీ ఇస్తే కేసీఆర్ పార్టీ భారత రాష్ట్ర సమితి దాన్ని రూ.5 వేలకు పెంచిందని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో వివాహ స‌మ‌యంలో మ‌హిళ‌ల‌కు 10 గ్రాముల బంగారం, ఉచిత ఇంటర్నెట్ వంటి అంశాల‌ను కూడా చేర్చ‌నున్న‌ట్టు టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ డి.శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

వివ‌రాల్లోకెళ్తే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో వివిధ పార్టీలు ముమ్మ‌రంగా ప్ర‌చారం సాగిస్తున్నాయి. అధికారం ద‌క్కించుకోవడానికి రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఓట‌ర్ల పై  హామీల వ‌ర్షం కురిపిస్తున్నాయి. ఇప్ప‌టికే ఆరు హామీల‌తో దూకుడుగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్.. త‌మ మేనిఫెస్టోలో మ‌రిన్ని కీల‌క అంశాల‌ను చేర్చ‌నున్న‌ట్టు సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. పెళ్లి సమయంలో అర్హులైన మహిళలకు పది గ్రాముల బంగారం, లక్ష రూపాయల నగదు, విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్ వంటి హామీలు నవంబర్ 30న జరిగే తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉండే అవకాశం ఉంది.

టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ డి.శ్రీధర్ బాబు మాట్లాడుతూ పార్టీ మహాలక్ష్మి హామీ కింద రూ.లక్ష నగదుతో పాటు బంగారం అదనంగా ఉంటుంద‌ని తెలిపారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద తెలంగాణ వాసులు, వివాహ సమయానికి 18 ఏళ్లు నిండిన, తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.2 లక్షలకు మించని వధువులకు వివాహ సమయంలో రూ.1,00,116 ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. అయితే, కాంగ్రెస్ అద‌నంగా తులం బంగారం ఇవ్వాల‌నే హామీలను పేర్కొంది. ఒక తుల (10 గ్రాములు) బంగారాన్ని ఇస్తారు. బంగారం విలువ సుమారు రూ.50 వేల నుంచి రూ.55 వేల వరకు ఉంటుందని శ్రీధర్ బాబు తెలిపారు.

విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్ ను కూడా మేనిఫెస్టోలో చేర్చాలని యోచిస్తున్నట్లు మేనిఫెస్టో కమిటీ సభ్యుడొకరు తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లతో మాట్లాడి విధివిధానాలు రూపొందిస్తామని చెప్పారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయలేకపోతోందని ఆరోపించిన బీఆర్ఎస్ అధికార ప్రతినిధి శ్రావణ్ దాసోజు.. వారు ఎలాంటి హామీలు ఇవ్వడానికైనా వెనుకాడ‌ర‌ని విమ‌ర్శించారు. స్వతంత్ర భారతంలో ఏ రాజకీయ పార్టీ ఊహించని విధంగా పేదల కోసం వినూత్న విధానాలు, కార్యక్రమాలను తీసుకువచ్చి అమలు చేయడంలో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ముందంజలో ఉన్నారని దాసోజు అన్నారు.

బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఉదారతకు, ముఖ్యంగా పేదలు, అణగారిన వర్గాల పట్ల కరుణకు మారుపేరు అని కొనియాడారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీలకు కౌంటర్ గా ఎల్పీజీ సిలిండర్ రూ.400, సామాజిక పింఛన్ల పెంపు వంటి హామీలతో కేసీఆర్ బీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రకటించారు. అంత‌కుముందు,  'మహాలక్ష్మి' హామీ కింద మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, రూ.500కే ఎల్పీజీ సిలిండర్, రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios