హైద్రాబాద్ కు అమెరికా నుండి గంజాయిని సరఫరా చేస్తున్న విషయాన్ని ఎన్సీబీ బట్టబయలు చేసింది. కచ్చితమైన సమాచారం మేరకు ఎన్సీబీ అధికారుల సోదాల్లో భారీ ఎత్తున గంజాయి పట్టుబడింది.
హైదరాబాద్: Hyderabad కు USA నుండి Ganjaసరఫరా చేస్తున్నారని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో గుర్తించింది. హైద్రాబాద్ లక్డీకపూల్ లోని కొరియర్ కార్యాలయంలో NCB జరిపిన సోదాల్లో 1.42 కిలోల గంజాయి లభ్యమైంది. ఈ కేసులో హైద్రాబాద్ కు చెందిన అక్షయ్ జైన్, అమరేందర్ ను అరెస్ట్ చేశారు.
పరుపుల పేరుతో నిందితులు గంజాయిని దిగుమతిని చేసుకొన్నారని ఎన్సీబీ గుర్తించింది. కచ్చితమైన సమాచారం మేరకు ఎన్సీబీ అధికారులు లక్డీకపూల్ లోని Courier కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తే గంజాయి లభ్యమైంది. నిందితులు విదేశాల నుండి డ్రగ్స్ ను దిగుమతి చేసుకొంటున్నట్టుగా ఎన్సీబీ దర్యాప్తులో ఒప్పుకొన్నారని సమాచారం. డ్రగ్స్ తో పాటు గంజాయిని దేశంలోని పలు ప్రాంతాల్లోని కాలేజీ విద్యార్ధులకు విక్రయించారని సమాచారం.
కొరియర్ సంస్థలో సుమారు 1.42 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొన్నారు.గంజాయిని బ్లూమ్ మెట్రెస్ లో దాచి పెట్టారు.డార్క్ నెట్ ద్వారా నిందితులు డ్రగ్స్ దిగుమతి చేసుకొన్నారని ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ అమిత్ ఘావటే చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతం నుండి దేశంలోని పలు ప్రాంతాలకు గంజాయి సరఫరా అవుతున్న విషయాన్ని పోలీసులు గతంలో గుర్తించారు.తెలంగాణ కు చెందిన పోలీసులు విశాఖకు వెళ్లిన సమయంలో కాల్పులు కూడా చోటు చేసుకొన్న విషయం తెలిసిందే.ఈ పరిణామం గత ఏడాది రెండు రాష్ట్రాల్లో పెద్ద సంచలనంగా మారింది.
