చెప్పిన పనులు చేయరా..? తెలంగాణ బీజేపీ నేతలపై అమిత్ షా సీరియస్

చెప్పిన పనులు చేయరా..?  తెలంగాణ బీజేపీ నేతలపై అమిత్ షా సీరియస్
Highlights

తెలంగాణ బీజేపీ నేతలపై ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక రోజు పర్యటన నిమిత్తం ఆయన ఇవాళ హైదరాబాద్ వచ్చారు.. ఈ సందర్భంగా నాంపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో  పార్టీ నేతలతో సమావేశమయ్యారు

తెలంగాణ బీజేపీ నేతలపై ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక రోజు పర్యటన నిమిత్తం ఆయన ఇవాళ హైదరాబాద్ వచ్చారు.. ఈ సందర్భంగా నాంపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో  పార్టీ నేతలతో సమావేశమయ్యారు. తాను గతంలో చెప్పిన  పనులు పూర్తి చేయకపోవడంపై షా నేతలపై మండిపడ్డారు..  వచ్చే నెల 15 లోగా ఆ పనులు పూర్తి చేయాలని నేతలకు టార్గెట్ ఇచ్చారు..

బూత్ కమిటీల నియామకంలో జాతీయ పార్టీ రూపొందించిన మార్గదర్శకాలతో  కాకుండా సొంత అజెండాతో ఎందుకు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పార్టీ 23 మార్గదర్శకాలను పొందుపరచగా.. రాష్ట్ర నేతలు 12 గైడ్‌లైన్స్‌కే వాటిని ఎందుకు కుదించారని ప్రశ్నించారు.. అలాగే అన్ని నియోజకవర్గాల్లో యాత్రలు చేపట్టాలని.. ప్రతీ గ్రామాన్ని టచ్ చేయాలని సూచించారు. ప్రతీ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్‌లను ఏ, బీ, సీ, డీలుగా విభజించాలని సూచించారు..
 

loader