alert: మీ ట్విట్టర్ అక్కౌంట్ కేవలం ఒక నిమిషంలో హ్యాక్ చేయవచ్చు.. ఈ విషయం తెలుసుకోండి

ట్విట్టర్ అకౌంట్ వెరిఫికేషన్ తో పాటు ప్రస్తుతం పెద్ద స్కామ్ జరుగుతోంది. మీ Twitter అక్కౌంట్ వేరిఫైడ్ అయిన వెంటనే, కొన్ని సెకన్ల తర్వాత మీకు Twitter సపోర్ట్ టీమ్ పేరుతో  మెసేజ్ వస్తుంది.

Your Twitter account can be hacked in just a minute, know how to stay safe

మైక్రో బ్లాగ్గింగ్ ఫ్లాట్ ఫార్మ్ ట్విట్టర్ (Twitter) అక్కౌంట్ వెర్ఫికేషన్ ఇప్పుడు చాలా సులభం.  సింపుల్ గా చెప్పాలంటే ట్విట్టర్  బ్లూ టిక్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఇప్పుడు చాలా సులభం అయింది. ట్విట్టర్ అక్కౌంట్ వేరిఫైడ్ కావాలనుకునేవారు మీలో చాలా మంది ఉంటారు, కానీ మీరు తెలుసుకోవలసిన చాలా ముఖ్యమైన విషయాలు కొన్ని ఉన్నాయి. ప్రస్తుతం ట్విటర్‌లో పెద్ద స్కామ్ జరుగుతోంది, అయితే అక్కౌంట్ వెర్ఫికేషన్ తో మాత్రమే మీరు బాధితులుగా మారవచ్చు... దాని గురించి తెలుసుకుందాం....

అకౌంట్ వెరిఫై అయిన వెంటనే ఈ మెసేజ్ 
ట్విట్టర్ అకౌంట్ వెరిఫికేషన్ తో పాటు ప్రస్తుతం పెద్ద స్కామ్ జరుగుతోంది. మీ Twitter అక్కౌంట్ వేరిఫైడ్ అయిన వెంటనే, కొన్ని సెకన్ల తర్వాత మీకు Twitter సపోర్ట్ టీమ్ పేరుతో  మెసేజ్ వస్తుంది, నిజానికి ఈ మెసేజ్ Twitter సపోర్ట్ టీం నుండి కాదు కానీ స్కామర్ల నుండి వస్తుంది. 

ఈ మెసేజ్‌లో మీ ఇ-మెయిల్ ఐడి, మొబైల్ నంబర్, గుర్తింపు కార్డు అడగబడతారు. మీరు మోసపోయే విధంగా ఈ మెసేజ్ ఉంటుంది ఇంకా మీరు నిజంగా ట్విట్టర్ నుండి మెసేజ్ వస్తుందని భావించవచ్చు.

రీ వెరిఫికేషన్ కోసం సమాచారం అందించాలని, లేకుంటే బ్లూ టిక్ తొలగిపోతుందని కూడా మెసేజ్‌లో రాసి ఉంటుంది. మీరు స్కామర్లకు   మీ సమాచారాన్ని షేర్ చేసిన వెంటనే, మీ ఈ-మెయిల్‌కు ట్విట్టర్ లాగిన్ లేదా పాస్‌వర్డ్ రీసెట్ నోటిఫికేషన్ వస్తుంది. పొరపాటున కూడా దానిపై క్లిక్ చేయవద్దు, లేదంటే మీ అక్కౌంట్ క్షణాల్లో హ్యాక్ చేయబడుతుంది.

దీని నివారించాలంటే మీరు టు ఫాక్టర్ అతేంటికేషన్ ఆన్ చేయడం ముఖ్యం. అంతేకాకుండా ట్విట్టర్ సపోర్ట్ పేరుతో వచ్చే లేదా మీ నుండి వ్యక్తిగత సమాచారం అడిగిన  మెసేజ్ కి రిప్లయి ఇవ్వకండి. అలాంటి మెసేజ్ ఏదైనా వస్తే వెంటనే రిపోర్ట్ చేసి అకౌంట్ బ్లాక్ చేయండి. అకౌంట్ వేరిఫై చేస్తే జాగ్రత్తగా ఉండండి ఇంకా ఈ-మెయిల్ ఐడి, ఫోన్ నంబర్ వంటి సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios