Asianet News TeluguAsianet News Telugu

ఐఫోన్ కి పోటీగా షియోమీ కొత్త సిరీస్: లాంచ్‌కు ముందే స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్లు లీక్..

ఒక నివేదిక ప్రకారం  షియోమీ 13 లైట్, షియోమీ 13, షియోమీ 13 ప్రో  గ్లోబల్ వేరియంట్‌ల ధరలను, అలాగే మూడు మోడళ్ల హై-రిజల్యూషన్ రెండర్‌లను లీక్ చేసింది. టిప్‌స్టర్ ప్రకారం, షియోమీ 13  బేస్ వేరియంట్ ధర EUR 999 (దాదాపు రూ. 88,700), షియోమీ 13 Pro ధర EUR 1299 (దాదాపు రూ. 1,15,300) ఉంటుందని అంచనా.
 

Xiaomi 13 Series: Price of this smartphone and features revealed before launch
Author
First Published Feb 20, 2023, 11:14 AM IST

షియోమీ కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్ షియోమీ 13 సిరీస్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఈ ఫోన్ ఫిబ్రవరి 26న భారత్‌తో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సిరీస్ కింద, కంపెనీ షియోమీ 13 లైట్, షియోమీ 13, షియోమీ 13 ప్రోలను ప్రవేశపెట్టవచ్చు. అయితే లాంచ్ చేయడానికి ముందే, ఈ ఫోన్ ధర, స్పెసిఫికేషన్లే గురించి సమాచారం వెల్లడైంది. షియోమీ 13 లైనప్ ధర, కలర్ ఇంకా డిజైన్ వివరాలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి.ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌ను అమర్చవచ్చని పేర్కొంది. 

షియోమీ 13 సిరీస్  ధర
ఒక నివేదిక ప్రకారం  షియోమీ 13 లైట్, షియోమీ 13, షియోమీ 13 ప్రో  గ్లోబల్ వేరియంట్‌ల ధరలను, అలాగే మూడు మోడళ్ల హై-రిజల్యూషన్ రెండర్‌లను లీక్ చేసింది. టిప్‌స్టర్ ప్రకారం, షియోమీ 13  బేస్ వేరియంట్ ధర EUR 999 (దాదాపు రూ. 88,700), షియోమీ 13 Pro ధర EUR 1299 (దాదాపు రూ. 1,15,300) ఉంటుందని అంచనా.

టిప్‌స్టర్ ప్రకారం, షియోమీ సివి 2  రీబ్రాండెడ్ వెర్షన్ అయిన షియోమీ 13 లైట్ ధర EUR 499 (దాదాపు రూ. 44,000)గా ఉండవచ్చు. ఈ సిరీస్‌ను భారతదేశంలో కూడా అదే ధరకు అందించవచ్చు. ఈ ఫోన్‌ను భారతదేశంలో అమెజాన్ ఇండియా నుండి కొనుగోలు చేయవచ్చు. 

షియోమీ 13 సిరీస్ స్పెసిఫికేషన్లు
సిరీస్ లాగానే షియోమీ 13 లైట్, షియోమీ 13, Xiaomi 13 ప్రో అనే మూడు ఫోన్‌లు ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేయబడతాయి. షియోమీ 13 Pro అదే రోజున భారతదేశంలో లాంచ్ అవుతుంది. లీక్ ప్రకారం, Xiaomi 13 ప్రో బ్లాక్ అండ్ వైట్ అనే రెండు కలర్ ఆప్షన్లలో అందించబడుతుంది. బేస్ వేరియంట్ గ్రీన్, బ్లాక్ ఇంకా వైట్ కలర్ ఆప్షన్‌లలో లాంచ్ చేయబడుతుంది అండ్ షియోమీ 13 లైట్ బ్లాక్, పింక్ ఇంకా బ్లూ కలర్స్‌లో లాంచ్ చేయబడుతుంది. 

షియోమీ 13 Pro ఫీచర్స్ అండ్ కెమెరా
మరోవైపు, ఫోన్ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడితే ఈ  ఫోన్ అడ్రినో GPUతో క్వాల్ కం   స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌తో  ఉంటుంది. అండ్రాయిడ్ 13 ఆధారిత MIUI 14 కస్టమ్ స్కిన్ సపోర్ట్ ఫోన్‌లో  ఉంటుంది. ఫోన్ చైనీస్ వేరియంట్ లాగా 6.73-అంగుళాల 2K OLED డిస్‌ప్లేతో లాంచ్ చేయబడుతుంది, ఇది 120Hz రిఫ్రెష్ రేట్, HDR10 +, 1900 nits పీక్ బ్రైట్‌నెస్‌ను పొందవచ్చు.

ఫోన్ లైకాతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్‌ను పొందుతుంది,  50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 50-మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్‌ను పొందుతుంది. సెల్ఫీ ఇంకా వీడియో కాల్స్ కోసం ఫోన్‌లో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించవచ్చు. 

షియోమీ 13 ప్రొ 120W ఫాస్ట్ అండ్ 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,820mAh బ్యాటరీని పొందవచ్చు. ఫోన్‌లో కనెక్టివిటీ కోసం, 5G, 4G LTE, Wi-Fi 6, USB టైప్-సి పోర్ట్, బ్లూటూత్ 5.3, ఎన్‌ఎఫ్‌సి, జి‌పి‌ఎస్ ,   ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌కి సపోర్ట్ ఇచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios