Asianet News TeluguAsianet News Telugu

అతిపెద్ద బ్యాటరీతో లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌.. ప్రపంచంలో తొలి ఫోన్ ఇదే.. వాటర్ అండ్ డస్ట్ రిసిస్టంట్ కూడా..

ఈ ఫోన్ ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసింది, పెద్ద బ్యాటరీతో 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇందులో అందించారు. ఈ ఫోన్ లో 6.79-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే, మీడియాటెక్ హీలియో జి95 ప్రాసెసర్‌ ఉంది. 

worlds largest battery smartphone launched by This company know its features and price
Author
Hyderabad, First Published Aug 24, 2022, 2:30 PM IST

ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాటరీతో ఒక కొత్త స్మార్ట్‌ఫోన్‌ విడుదలైంది. ఊకిటెల్ (Oukitel) అనే చైనా స్మార్ట్ ఫోన్ బ్రాండ్ 21000mAh బ్యాటరీతో ఊకిటెల్ WP19  రగ్గెడ్  స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసింది, పెద్ద బ్యాటరీతో 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇందులో అందించారు. ఈ ఫోన్ లో 6.79-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే, మీడియాటెక్ హీలియో జి95 ప్రాసెసర్‌ ఉంది. 8జి‌బి ర్యామ్ తో 256జి‌బి స్టోరేజ్ ఉంది. ఈ ఫోన్ ఇతర ఫీచర్లు, స్పెసిఫికేషన్ల గురించి తెలుసుకుందాం...

ఊకిటెల్ WP19 ధర 
అలీ ఎక్స్ ప్రెస్ లో ప్రీమియర్ సేల్ సందర్భంగా ఈ ఫోన్ భారీ తగ్గింపుతో వస్తుంది. ఈ సెల్‌లో ఫోన్‌ను $ 259.99 అంటే దాదాపు రూ. 20,743కి కొనుగోలు చేయవచ్చు. ఈ డీల్ ఆగస్టు 26 వరకు కొనసాగనుంది. 

ఫీచర్స్ 
6.79-అంగుళాల ఫుల్ HD ప్లస్ డిస్‌ప్లే, 397 PPI అండ్ 90Hz రిఫ్రెష్ రేట్‌,  MediaTek Helio G95 ప్రాసెసర్ 8జి‌బి ర్యామ్ అండ్ 256జి‌బి స్టోరేజ్, వాటర్ అండ్ డస్ట్ రిసిస్టంట్ కోసం IP68 అండ్ IP69K & MIL-STD-810H రేటింగ్‌ పొందింది. దీని వల్ల ఈ ఫోన్‌ను అత్యంత బలంగా ఇంకా మన్నికగా చేస్తుంది. దీనితో పాటు ఫోన్‌లో సెక్యూరిటి కోసం ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇచ్చారు.

కెమెరా
ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది, ఇందులో Samsung 64 ఎం‌పి ప్రైమరీ కెమెరా, రెండవది 20 ఎం‌పి నైట్ విజన్ సెన్సార్ SONY IMX350 అండ్ మూడవది 3 ఎం‌పి కెమెరా సెన్సార్ ఇచ్చారు. ఈ ఫోన్ కెమెరాతో మీరు సాన్ ల్లైట్ ఇంకా చీకటిలో కూడా హై-క్వాలిటీ  ఫోటోలను తీయవచ్చు. అలాగే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీని కూడా చేసుకోవచ్చు. ఫోన్ ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు.

 బ్యాటరీ
ఊకిటెల్ WP19 బ్యాటరీ ఈ ఫోన్‌ను అత్యంత ప్రత్యేకమైనదిగా చేస్తుంది. 21000mAh బ్యాటరీతో వస్తున్న ప్రపంచంలోనే తొలి ఫోన్ ఇదే. అలాగే 33W ఫాస్ట్ ఛార్జింగ్ ఇందులో ఉంది. 0 నుండి 80 శాతం వరకు ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి 3 గంటలు పడుతుందని కంపెనీ పేర్కొంది. ఫోన్‌లో రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios