ఇన్‌స్టాగ్రామ్ ద్వారా 18 ఏళ్ల తర్వాత చిన్ననాటి ఫ్రెండ్ ని.. సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్.. చివరికి ఏమైందంటే..

తన చిన్ననాటి స్నేహితురాలితో మళ్లీ కలవాలనుకున్న ఓ అమ్మాయి ఇన్‌స్టాగ్రామ్ పేజీని క్రియేట్ చేసి ఆమె కోసం వెతకడం ప్రారంభించింది. ఇప్పుడు ఆమె చేసే తపన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 

Woman creates Instagram profile just to find childhood friend-sak

సోషల్ మీడియా ద్వారా ప్రపంచంలో ఎక్కడున్న మరో మూలాన ఉన్న వ్యక్తితో కనెక్ట్ అవ్వొచ్చు. అయితే ఒకప్పటి చిన్ననాటి ఫ్రెండ్ ఎక్కడుందో  తెలుసుకోవడానికి ఆమె స్నేహితురాలు  సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. 

నేహా అనే అమ్మాయి తన ఎల్‌కెజి స్నేహితురాలు లక్షితను కనుగొనడానికి ప్రత్యేకంగా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్  క్రియేట్ చేసింది. తను చూడాలనుకున్న చిన్ననాటి ఫ్రెండ్ పూర్తి పేరు కూడా ఆమెకి  గుర్తులేదు. ఆమె అకౌంట్ కు @finding_Lakshita అని పేరు పెట్టింది అలాగే    ఫోటోని  కూడా షేర్ చేసింది.

ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ బయోలో ఆమె  ఫ్రెండ్  గురించి కొంత సమాచారాన్ని కూడా పేర్కొంది. "చాలా కాలం క్రితం తప్పిపోయిన నా చిన్ననాటి స్నేహితురాలు లక్షిత వయసు 21. ఆమె సోదరుడు కునాల్. ఇద్దరినీ కనుగొనే పనిలో ఉన్నాను" అని పోస్ట్ లో పేర్కొంది.

నేహా ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫ్రెండ్ పేరుతో కాంటాక్ట్స్  సంప్రదించడం, విచారించడం ప్రారంభించింది. చివరగా, ఆమె లక్షితని కనుగొంది. లక్షిత స్వయంగా నేహా చేసిన పోస్ట్‌ని చూసి ఆమెను సంప్రదించింది. ఇద్దరూ కలిసినందుకు @finding_lakshita పేజీని అప్ డేట్ చేసారు.

దింతో ఆమె తన ఫ్రెండ్ కోసం చేసిన సెర్చ్ సక్సెస్ అయింది.. ఎట్టకేలకు నేను ఆమెను కనుగొన్నాను' అంటూ వీడియోతో పాటు పోస్ట్ చేసింది. "చివరిగా!!! నేను నిన్ను కనిపెట్టాను. నిన్ను కనుక్కోవడం అంత సులభం కాదు. కానీ ఎలాగోలా చేశాను. దాదాపు 18 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని సంప్రదించడం అపురూపంగా ఉంది." అని అన్నారు. 

"నాకు LKG (2006)లో లక్షిత అనే స్నేహితురాలు ఉండేది. ఆమె జైపూర్‌కి వెళ్లడంతో నాకు ఆమెతో సంబంధాలు తెగిపోయాయి. ఆమె ఇంటిపేరు కూడా నాకు గుర్తులేదు..." అని ఆమె వెల్లడించింది.

నేహా పెట్టిన ఈ పోస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను 70 లక్షల మందికి పైగా వీక్షించారు. పోస్ట్‌కి 7,56,000 లైక్‌లు వచ్చాయి. ఈ పోస్ట్‌పై లక్షిత స్పందిస్తూ.. ‘నువ్వు నన్ను ఏడిపించావు. ఈ పోస్ట్ చూసిన చాలా మంది వారి  అభిప్రాయాలను ఉద్వేగంతో వ్యక్తం చేస్తున్నారు.

"నేను కూడా ఇప్పటికీ నా చిన్ననాటి స్నేహితురాలు కోసం వెతుకుతున్నాను. ఆమె ఫోటో కూడా నా దగ్గర లేదు. నేను ఆమెను త్వరలో కనుగొంటానని ఆశిస్తున్నాను" అని ఒకరు కామెంట్లో పేర్కొన్నారు. అంతేకాదు "కొన్నిసార్లు సోషల్ మీడియా చాలా సహాయపడుతుంది" అని మరొకరు  కామెంట్ చేసారు.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Neha (@heyyneha)

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios