Asianet News TeluguAsianet News Telugu

మూడు సిమ్ కార్డ్లతో ధర రూ.6249 మాత్రమే; గురువారం నుంచి సేల్స్..

Moto G04 4GB అండ్ 8GB RAM వేరియంట్లలో అందుబాటులో ఉంది. ర్యామ్ బూస్ట్‌తో దీన్ని 16జీబీ వరకు విస్తరించుకోవచ్చని కంపెనీ తెలిపింది.

With all the amazing features, the price is only Rs 6249; Motorola will start selling on Thursday-sak
Author
First Published Feb 17, 2024, 1:53 PM IST

లెనోవా యాజమాన్యంలోని మోటోరోలా సరికొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మోటో జీ04ను లాంచ్  చేసింది. Moto G04 సరికొత్త ఆండ్రాయిడ్ వెర్షన్ ఆండ్రాయిడ్ 14తో సరసమైన స్మార్ట్‌ఫోన్‌గా కూడా మారుతోంది. Moto G04 IP52 వాటర్ రిపెల్లెంట్ డిజైన్, 15W ఛార్జర్‌తో కూడిన 5000mAh బ్యాటరీ, డాల్బీ అట్మోస్ స్పీకర్లతో సహా వస్తుంది.  క్వాడ్-పిక్సెల్ కెమెరా సిస్టమ్‌తో కూడిన 16-మెగాపిక్సెల్ AI కెమెరా అండ్ డే టైం, లో -లైట్ రెండింటిలోనూ మెరుగైన ఫోటోల కోసం యునిసెక్ T606 చిప్‌సెట్‌తో UFS 2.2 స్టోరేజ్ కూడా ఉంది.

Moto G04 కాంకర్డ్ బ్లాక్, సీ గ్రీన్, శాటిన్ బ్లూ అండ్ సన్‌రైజ్ ఆరెంజ్ అనే నాలుగు కలర్స్ లో లభిస్తుంది. ఇంకా యాక్రిలిక్ గ్లాస్ ఫినిషింగ్‌తో ప్రీమియం డిజైన్‌తో వస్తుంది.  90 Hz రిఫ్రెష్ రేట్‌తో 16.66 cm (6.6”) IPS LCD పంచ్-హోల్ డిస్‌ప్లే  ఉంది.

Moto G04 4GB అండ్ 8GB RAM వేరియంట్లలో అందుబాటులో ఉంది. ర్యామ్ బూస్ట్‌తో దీన్ని 16జీబీ వరకు విస్తరించుకోవచ్చని కంపెనీ తెలిపింది. 64GB అలాగే  128GB రెండు స్టోరేజ్ ఆప్షన్‌లతో మైక్రో SD కార్డ్‌ని ఉపయోగించి స్టోరేజీని 1TB వరకు పెంచుకోవచ్చు. ఇందులో ట్రిపుల్ సిమ్ కార్డ్ స్లాట్ కూడా ఉంది. రెండు మెమరీ వేరియంట్‌ల ధరలు రూ.6,999 అండ్  రూ.7,999.

లాంచ్ ఆఫర్‌లో భాగంగా, కస్టమర్లు ఇతర ఫోన్‌ల ఎక్స్చేంజ్ పై రూ.750 అదనపు తగ్గింపుతో 4GB+64GB వేరియంట్‌ను రూ.6,249కి పొందవచ్చు. Moto G04 ఫిబ్రవరి 22 మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్‌కార్ట్, మోటరోలా వెబ్‌సైట్ ఇంకా  రిటైల్ స్టోర్‌లలో   అందుబాటులో ఉంటుంది.

Follow Us:
Download App:
  • android
  • ios