త్వరలో మైక్రోసాఫ్ట్ విండోస్ కొత్త వెర్షన్.. ఈ ఏడాది చివరిలో లేటెస్ట్ ఫీచర్లు..?

మైక్రోసాఫ్ట్ ఇప్పుడు ప్రతి మూడు సంవత్సరాలకు Windows  మేజర్ ఎడిషన్స్ విడుదల చేసే ప్రణాళికపై పని చేస్తోంది. Windows 12, Windows  నెక్స్ట్ మేజర్ ఎడిషన్ 2024లో విడుదల చేయనుంది.
 

Windows 12 is coming soon, Microsoft is working on its development

అమెరికన్ మల్టీ నేషనల్ టెక్నాలజి కొర్పోరేషన్ మైక్రోసాఫ్ట్  కొత్త విండోస్ డేవలప్మెంట్ పై పనిచేస్తుంది. కంపెనీ మూడేళ్ల సైకిల్ కొనసాగిస్తుందని అలాగే 2024లో కొత్త విండోస్ ఎడిషన్‌ను విడుదల చేయవచ్చని భావిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ పాత పేరు ట్రెండ్ ప్రకారం, ఈ కొత్త విండోస్ ఎడిషన్ పేరు Windows-12. నివేదిక ప్రకారం, మైక్రోసాఫ్ట్  ప్రస్తుత విండోస్ వెర్షన్‌కు కొత్త ఫీచర్లను కూడా తీసుకురానుంది. కంపెనీ తాజాగా Windows 11 కోసం కొత్త అప్‌డేట్ 22H2ని పూర్తి చేసింది, దీనిని సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో యూజర్లకు అందించవచ్చు.

విండోస్ సెంట్రల్‌లోని ఒక నివేదిక ప్రకారం, మైక్రోసాఫ్ట్ ఇప్పుడు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి విండోస్  మేజర్ ఎడిషన్‌లను విడుదల చేసే ప్రణాళికపై పని చేస్తోంది. Microsoft Windows Windows 12  నెక్స్ట్ మెయిన్ ఎడిషన్‌ను 2024లో విడుదల చేయవచ్చు. కంపెనీ Windows 11  2023 వెర్షన్‌ను 'సన్ వ్యాలీ 3' అనే కోడ్‌నేమ్‌తో పూర్తి చేసినట్లు నివేదించింది. కేవలం ఒక సంవత్సరం క్రితం మైక్రోసాఫ్ట్ Windows 11 కోసం ఒక మేజర్ ఫీచర్ అప్‌డేట్‌ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు త్వరలో దీని అప్‌డేట్ కూడా అందుబాటులోకి రానుంది. 

ఈ అప్‌డేట్‌ల మధ్య మైక్రోసాఫ్ట్ విండోస్ కొత్త ఎడిషన్‌ల కోసం ఫీచర్ల రోల్ అవుట్‌ను పెంచాలని యోచిస్తోంది. ఈ ఫీచర్లు త్వరలో విడుదల కానున్న Windows 11 వెర్షన్ 22H2 (సన్ వ్యాలీ 2) నుండి అందుబాటులోకి వస్తాయి. ఈ సంవత్సరం చివరి నాటికి మరిన్ని కొత్త ఫీచర్లు అందుబాటులోకి రావచ్చు. ఇంతకుముందు మైక్రోసాఫ్ట్  వెర్షన్‌ను అప్‌డేట్ చేయడానికి, కొత్త ఫీచర్లను తీసురవడానికి ఒక సంవత్సరం పాటు వేచి ఉండేది. కానీ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ యూజర్ ఎక్స్పీరియన్స్ మెరుగుపరిచేందుకు కృషి చేస్తోంది అలాగే దీని కోసం  తరచుగా అప్ డేట్స్ కూడా అందిస్తుంది. మైక్రోసాఫ్ట్ ఈ సంవత్సరం ప్రారంభంలో టాస్క్‌బార్‌కు కొత్త అప్‌డేట్‌లను విడుదల చేసినప్పుడు మూమెంట్స్ విధానాన్ని కూడా పరీక్షించింది. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కోడ్ నేమ్ సన్ వ్యాలీ 3  వర్క్ పూర్తయింది, మైక్రోసాఫ్ట్ దీనికి కొత్త ఫీచర్లను అందించవచ్చని భావిస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios