Asianet News TeluguAsianet News Telugu

మీ ఫోన్‌లో 5జి కనెక్టివిటీ ఉందా..లేదా.. 5G బ్యాండ్‌లను ఇలా చెక్ చేయండి..

5G సపోర్ట్ కోసం మీ ఫోన్ తప్పనిసరిగా 450MHz కంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉండాలి.  మీ దగ్గర ఉన్న 5G ఫోన్ చట్టబద్ధంగా లేదా మంచి స్పీడ్ తో 5G ఇంటర్నెట్‌ని రన్ చేస్తుందా లేదా అనే ప్రశ్న తలెత్తుతుంది.

will 5G run in your phone or not check 5G bands in your phone like this
Author
Hyderabad, First Published Aug 6, 2022, 10:27 AM IST

ఇండియాలో 5G కనెక్టివిటీ త్వరలో ప్రారంభం కానుంది, అయితే రెండేళ్ల క్రితమే 5G కనెక్టివిటీతో కూడిన ఫోన్లు భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రావడం ప్రారంభించాయి. ఈ ట్రెండ్ ఇప్పటికీ కొనసాగుతోంది కానీ 5Gకి లో (600 MHz, 700 MHz, 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz, 2500 MHz), మిడ్ (3300 MHz), హై (26 GHz)తో సహా పలు రకాల ఫ్రీక్వెన్సీలు అవసరం. దీనిని mmWave అని కూడా అంటారు. 5G సపోర్ట్ కోసం మీ ఫోన్ తప్పనిసరిగా 450MHz కంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉండాలి.  మీ దగ్గర ఉన్న 5G ఫోన్ చట్టబద్ధంగా లేదా మంచి స్పీడ్ తో 5G ఇంటర్నెట్‌ని రన్ చేస్తుందా లేదా అనే ప్రశ్న తలెత్తుతుంది, ఎందుకంటే మీ 5G ఫోన్‌లో 5G స్పీడ్ మీ ఫోన్‌లో ఉన్న 5G బ్యాండ్‌లపై ఆధారపడి ఉంటుంది. అయితే ఫోన్ 5G బ్యాండ్‌లను చెక్ చేయడానికి సులభమైన మార్గాల గురించి చూద్దాం..

డివైజ్ అఫిషియల్ సైట్‌లో చెక్ చేయండి
మీ ఫోన్ కంపెనీ అఫిషియల్ సైట్ ద్వారా ఫోన్‌లో 5G బ్యాండ్‌లను చెక్ చేయడానికి ఈజీ వే. దాదాపు ప్రతి కంపెనీ  అధికారిక వెబ్‌సైట్‌లో అన్ని డివైజెస్ సంబంధించిన సమాచారాన్ని ఉంచుతుంది. 5G బ్యాండ్‌లను చెక్ చేయడానికి, మీరు ఫోన్ కంపెనీ అధికారిక సైట్‌కి వెళ్లాలి, ఆ తర్వాత ఫోన్ మోడల్‌ను సెలెక్ట్ చేసుకొని దాని స్పెసిఫికేషన్ విభాగానికి వెళ్లండి. ఆ తర్వాత మీరు ఫోన్ నెట్‌వర్క్ అండ్ కనెక్టివిటీ ఆప్షన్ కి వెళ్లాలి, ఇక్కడ మీరు 5G బ్యాండ్‌ల (SA అండ్ 5G NSA) గురించి సమాచారాన్ని చూడవచ్చు

మీ ఫోన్ బాక్స్‌ను చెక్ చేయండి
మీ ఫోన్‌లో 5G బ్యాండ్‌లను చెక్ చేయడానికి ఇది ఒక సులభమైన మార్గం. చాలా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు ఇప్పుడు 5G బ్యాండ్‌లకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఫోన్ బాక్స్‌పైనే  ఇవ్వడం ప్రారంభించాయి. 5G బ్యాండ్‌లను చెక్ చేయడానికి మీరు ఫోన్ బాక్స్‌లో  రేడియో సమాచార విభాగంలో NR అంటే న్యూ రేడియో లేదా SA / NSA 5G బ్యాండ్‌ని చూడాలి, అక్కడ మీరు మీ ఫోన్  5G బ్యాండ్‌ల గురించి పూర్తి సమాచారాన్ని పొందుతారు. 

ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లు లేదా ఇ-కామర్స్ సైట్‌లు 
కొన్ని ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లు మొబైల్ ఫీచర్‌లకు సంబంధించిన సమాచారాన్ని కూడా అందిస్తాయి, మీరు ఈ వెబ్‌సైట్ సహాయంతో మీ ఫోన్  5G బ్యాండ్‌ల గురించి సమాచారాన్ని పొందవచ్చు. మీరు ఆ వెబ్‌సైట్‌లో మీ ఫోన్‌ మోడల్ ను సెర్చ్ చేసి ఫోన్ స్పెసిఫికేషన్ విభాగానికి వెళ్లాలి. దీని తర్వాత 5G విభాగంలో SA/NSA 5G బ్యాండ్‌ల నంబర్ చెక్ చేయండి. 

ఐఫోన్‌లో 5G బ్యాండ్‌లను ఎలా చెక్ చేయాలి
ఆండ్రాయిడ్ లగా కాకుండా 5G బ్యాండ్‌ల గురించి సమాచారం iPhone బాక్స్‌పై అందుబాటులో లేదు. Apple అధికారిక సైట్ ద్వారా 5G బ్యాండ్‌లను చెక్ చేయడానికి సులభమైన మార్గం. ఆపిల్  ఐఫోన్ సమాచారాన్ని ఒకే ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉంచుతుంది. మీరు www.apple.com/iphone/cellularకి వెళ్లి మీ ఫోన్ మోడల్‌ని సెలెక్ట్ చేసుకొని స్పెసిఫికేషన్ విభాగంలో 5G బ్యాండ్‌ల స్టేటస్ చెక్ చేయాలి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios