Asianet News TeluguAsianet News Telugu

WhatsApp tip: వాట్సాప్ ఎడిట్ ఆప్షన్! తప్పుగా పంపిన మెసేజ్ సులభంగా ఎడిట్ చేయడం ఎలా?

ఈ ఫీచర్ అందరికీ అందుబాటులో ఉంటుంది. కానీ వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్‌లో మాత్రమే ఎడిటింగ్ సౌకర్యం ఉంది. అందువల్ల, పాత వెర్షన్‌ను ఉపయోగిస్తున్న వినియోగదారులు ఈ ఫీచర్‌ను కోరుకుంటే కొత్త వెర్షన్‌కు అప్‌గ్రేడ్ చేయాలి.
 

WhatsApp tip: WhatsApp edit option! How to edit a wrongly sent message easily?-sak
Author
First Published Jul 11, 2023, 11:01 AM IST

మెటా యాజమాన్యంలోని ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తాజగా  పంపిన మెసేజెస్  ఎడిటి చేసే  కొత్త ఫీచర్లతో పరిచయం చేసింది, ఇది వినియోగదారులు వ్యక్తిగత చాట్‌లను లాక్ చేయడానికి, మల్టి డివైజెస్ లో వాట్సాప్‌కు లాగిన్ చేయడానికి ఉపయోగపడుతుంది.

ఎడిట్ మెసేజ్ ఫీచర్ ద్వారా వాట్సాప్‌లో పంపిన మెసేజ్‌ని ఎడిట్ చేసుకోవచ్చు. అయితే దానికి ఒక కాలపరిమితి ఉంటుంది. ఈ ఫీచర్‌ని ఏ సమయంలోనూ ఉపయోగించలేరు. తప్పు పదం మొదలైనవి లేదా తప్పుగా టైప్ చేసిన  మెసేజ్  ఉంటే పంపిన 15 నిమిషాల్లో ఎడిట్ చేయవచ్చు.

ఈ ఫీచర్ అందరికీ అందుబాటులో ఉంటుంది. కానీ వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్‌లో మాత్రమే ఎడిటింగ్ సౌకర్యం ఉంది. అందువల్ల, పాత వెర్షన్‌ను ఉపయోగిస్తున్న వినియోగదారులు ఈ ఫీచర్‌ను కోరుకుంటే కొత్త వెర్షన్‌కు అప్‌గ్రేడ్ చేయాలి.

గతంలో పంపిన మెసేజ్‌లను డిలీట్ చేసే సదుపాయం వాట్సాప్ అందుబాటులోకి తేచ్చింది. దాని కంటే ఈ ఎడిట్ మెసేజ్ సౌకర్యం మరింత ఉపయోగకరమైన ఫీచర్. మెసేజ్‌ని డిలీట్ చేసి తప్పులుంటే మళ్లీ టైప్ చేసే బదులు, ఈ ఎడిట్ ఆప్షన్ లోపాలను త్వరగా సరిచేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

వాట్సాప్ యూజర్ ఇప్పుడు తప్పు మెసేజ్ లను నివారించడానికి ఈ సౌకర్యాలను ఉపయోగించవచ్చు. మెసేజ్ ఎడిట్ చేయడానికి తక్కువ సమయం ఉన్నప్పటికీ, పంపిన మెసేజ్ డిలేట్ చేయడానికి ఎక్కువ సమయం ఇవ్వబడుతుంది. నకిలీ వార్తలు, పుకార్ల వ్యాప్తిని అరికట్టడానికి కూడా ఈ సౌకర్యాలు పాక్షికంగా ఉపయోగించబడతాయి.

వాట్సాప్ యాప్‌లో మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న మెసేజ్‌ని రెండు సెకన్ల పాటు నొక్కి పట్టుకుంటే, మెసేజ్‌ని ఎడిట్ చేసే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిని సెలెక్ట్ చేసిన తర్వాత, మెసేజ్ ఎడిట్ చేయవచ్చు. అప్పుడు అవసరమైన దిద్దుబాటు చేయండి. 

పంపిన మెసేజ్ ఎడిట్ చేయడానికి మెసేజ్ పంపిన   సమయం నుండి 15 నిమిషాలు మాత్రమే ఇవ్వబడుతుందని గమనించండి. ఆ తర్వాత, మార్పులు చేయడానికి ఎడిట్ అప్షన్ ఉండదు. కానీ, ఆ మెసేజ్‌ని అన్‌సెండ్ చేసే సదుపాయం మాత్రమే ఉంటుంది. అవసరమైతే మెసేజ్  తొలగించడానికి మీరు దీన్ని ఉపయోగించవచ్చు.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మెసేజ్ సవరించినట్లయితే, రిసీవర్ కి ప్రత్యేక నోటిఫికేషన్ పంపబడదు. కానీ ఎడిట్ చేసిన మెసేజ్ దాని క్రింద ఎడిటెడ్ అని మాత్రమే ఉంటుంది. ఫొటోలు, వీడియోలు తదితరాలు పంపేటప్పుడు వాటి గురించిన నోట్స్ (క్యాప్షన్) జతచేస్తే వాటిని ఎడిట్ చేసుకునే సదుపాయం ఉండదు.

Follow Us:
Download App:
  • android
  • ios