ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్ నెట్‌వర్కింగ్ యాప్ వాట్సాప్ వివిధ అప్‌డేట్‌లను విడుదల చేస్తోంది. 

ఫోన్ నంబర్లకు బదులుగా యూజర్‌నేమ్‌లను మార్చుకునే సదుపాయాన్ని త్వరలో తీసుకురానున్నట్టు మెటా యాజమాన్యంలోని ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తెలిపింది. Google Play Store నుండి Android 2.23.11.15 కోసం తాజా WhatsApp బీటా అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఈ కొత్త ఫీచర్ ఉంటుంది. 

సింపుల్ గా చెప్పాలంటే, మెటా యాజమాన్యంలోని యూజర్‌నేమ్ ఫీచర్‌పై WhatsApp పని చేస్తుంది. దీని ద్వారా వినియోగదారులు వారి అకౌంట్ కోసం ప్రత్యేకమైన యూజర్ నేమ్ సెలెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి ప్లాట్‌ఫారమ్‌ల లాగానే కస్టమర్‌లు మొబైల్ నంబర్‌లకు బదులుగా వారి పేర్లను ఉపయోగించుకునేలా దీన్ని రూపొందిస్తున్నట్లు చెబుతున్నారు.

ఈ ఫీచర్ ప్రస్తుతం అభివృద్ధిలో ఉంది ఇంకా అందుబాటులోకి రాలేదు. WABetaInfo షేర్ చేసిన స్క్రీన్‌షాట్ ప్రకారం, యాప్ సెట్టింగ్‌లలో యూజర్‌నేమ్ ఫీచర్‌ను పరిచయం చేసే పనిలో WhatsApp ఉంది. ప్రత్యేకంగా, ఈ ఫీచర్‌ WhatsApp సెట్టింగ్‌లు > ప్రొఫైల్‌లో ఉంటుంది.

యూజర్ పేరును సెలెక్ట్ చేసుకునే ఫీచర్ తో వాట్సాప్ వినియోగదారులు వారి అకౌంట్ కి ప్రైవసీ మరింత జోడించే అవకాశం ఉంటుంది. కాంటాక్ట్స్ గుర్తించడానికి కేవలం ఫోన్ నంబర్‌లపై ఆధారపడే బదులు, వినియోగదారులు ప్రత్యేకమైన ఇంకా గుర్తుండిపోయే యూజర్ నేమ్ ఎంచుకోవచ్చు.

 మెట్ట యాజమాన్యంలోని వాట్సాప్ చాలా అవసరమైన ఫీచర్‌ను కూడా విడుదల చేసింది. మనం పంపే మెసేజ్ 15 నిమిషాల లోపు ఎడిట్ చేయవచ్చు. మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఈ వారం ప్రారంభంలో ఫేస్‌బుక్ పోస్ట్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు.

WhatsApp వినియోగదారులు ఇప్పుడు మెసేజ్ పంపిన తర్వాత 15 నిమిషాల లోపు ఎడిట్ చేయవచ్చు. ఎడిట్ మెసేజ్ ఆప్షన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. రాబోయే వారాల్లో పూర్తిగా అందరికీ అందుబాటులో ఉంటుంది. అయినప్పటికీ, ఎడిట్ చేసిన తరువాత 'ఏడిటెడ్'గా చూపిస్తుంది, మీరు పంపిన మెసేజ్ ఎడిట్ చేసినట్లు రిసీవర్ కి తెలియజేస్తుంది.