Asianet News TeluguAsianet News Telugu

Whatsapp Voice Message: వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్.. ఏంటంటే..?

ప్రపంచంలో ఎక్కువ మంది వినియోగిస్తున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్. మిగిలిన మెసేజింగ్‌ యాప్‌లలోనూ అవే ఫీచర్స్‌ ఉన్నప్పటికీ యూజర్‌ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్‌ కావడం వల్ల ఎక్కువ మంది వాట్సాప్‌ వైపే మొగ్గు చూపుతున్నారు. 

Whatsapp New feature now users enjoy Voice Message feature in whats up app
Author
Hyderabad, First Published Jan 14, 2022, 11:57 AM IST

సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. తన వినియోగదారుల కోసం మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకురానుంది. వాయిస్ నోట్ ఫీచర్ ద్వారా మరో కొత్త అప్డేట్ ను వినియోగదారులకు పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది. 

ప్రపంచంలో ఎక్కువ మంది వినియోగిస్తున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్. మిగిలిన మెసేజింగ్‌ యాప్‌లలోనూ అవే ఫీచర్స్‌ ఉన్నప్పటికీ యూజర్‌ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్‌ కావడం వల్ల ఎక్కువ మంది వాట్సాప్‌ వైపే మొగ్గు చూపుతున్నారు. తాజాగా వాట్సాప్‌లోని వాయిస్ నోట్‌ ఫీచర్‌లో మరో కొత్త అప్‌డేట్‌ను వినియోగదారులకు పరిచయం చేయనున్నట్లు సమాచారం. 

ఈ ఫీచర్ తో యూజర్స్ బ్యాక్‌గ్రౌండ్‌లోనే వాయిస్‌ మెసేజ్‌ వినవచ్చని వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్‌ వాట్సాప్ బీటా ఇన్ఫో (వాబీటాఇన్ఫో) తెలిపింది. ప్రస్తుతం వాయిస్‌ మెసేజ్ ప్లే చేసి చాట్‌ పేజీ నుంచి బయటకు వస్తే ఆడియో ఆగిపోతుంది. త్వరలో అందుబాటులోకి రానున్న అప్‌డేట్‌తో వాయిస్‌ మెసేజ్‌ ప్లే చేసి, ఇతరులతో చాట్ చేస్తూ ఆడియోను వినవచ్చు. 

మనం ప్లే చేసిన వాయిస్‌ మెసేజ్‌ చాట్ పేజీ పై భాగంలో కనిపిస్తుందని వాట్సాప్​ బీటా ఇన్ఫో వెల్లడించింది. గతంలో వాయిస్‌ మెసేజ్‌లు రికార్డ్‌ చేసిన వెంటనే సెండ్ అయ్యేవి కావు. కొద్దిరోజుల క్రితం ప్రివ్యూ వాయిస్‌ నోట్స్‌ పేరుతో కొత్త అప్‌డేట్‌ను తీసుకురానున్నట్లు వాబీటాఇన్ఫో తెలిపింది. దీంతో యూజర్స్ రికార్డ్ చేసిన మెసేజ్‌ను ఇతరులకు పంపే ముందే విని అందులో ఏవైనా తప్పులుంటే డిలీట్ చేసి, మరో కొత్త మెసేజ్‌ను రికార్డ్ చేసి పంపొచ్చు. అలానే వాయిస్‌ మెసేజ్‌ వినేప్పుడు వేగాన్ని నియంత్రించేందుకు వీలుగా ప్లేబ్యాక్‌ స్పీడ్ ఫీచర్‌ను కూడా వాట్సాప్‌ పరిచయం చేసింది. అయితే ఈ ఫీచర్స్‌ కొద్ది మంది యూజర్స్‌కు మాత్రమే అందుబాటులోకి వచ్చినట్లు సమాచారం. త్వరలోనే పూర్తిస్థాయిలో ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ యూజర్స్‌కు పరిచయం చేయనున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios