న్యూఢిల్లీ‌: సోషల్ మీడియాలో మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్‌’ మరో సరికొత్త ఫీచర్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తేనున్నది. వాట్సాప్‌లో సంబంధిత వేలిముద్ర గుర్తించే ఫీచర్‌ సిద్ధమైనట్లు సమాచారం. 

త్వరలో ఇది ఆండ్రాయిడ్‌ వినియోగదారులందరికీ అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్‌ వినియోగదారులకు భద్రతను మరింత పెంచనుంది. ఐవోఎస్‌లో ఇప్పటికే బయోమెట్రిక్‌ గుర్తింపు వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చిన ఆరునెలలకు ఈ ఫీచర్‌ రావడం గమనార్హం. 

ప్రస్తుతం బీటావెర్షన్‌లో ఈ ఫీచర్‌ అందుబాటులో ఉంది. ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ ఫీచర్‌పై పరీక్షల అనంతరం ఆండ్రాయిడ్‌ బీటా యూజర్ల కోసం దీన్ని రిలీజ్ చేసింది. అందుకోసం 2.19.221 ఆండ్రాయిడ్‌ బీటా వెర్షన్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మూడు చుక్కల మెనూను తెరిచి.. దానిలో సెట్టింగ్స్‌ నుంచి అకౌంట్‌కు వెళ్లాలి. అక్కడ ‘ఫింగర్‌ ప్రింట్‌ లాక్‌’ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. 

ఒకవేళ మీరు అప్‌డేట్‌ చేసినా ఈ ఆప్షన్‌ కనిపించకపోతే.. మీ చాట్‌ హిస్టరీని బ్యాకప్‌ తీసుకొని యాప్‌ను రీఇన్‌స్టాల్‌ చేయాలి. ఫింగర్‌ ప్రింట్‌ లాక్‌ను ఓపెన్‌ చేసేందుకు మీ వేలిముద్రను నమోదు చేసుకోవాలి. తర్వాత ఆటోమేటిక్‌ లాక్‌ సమయాన్ని ఎంచుకోవాలి. ఈ లాక్‌ ఉన్నా వాట్సాప్‌ కాల్స్‌ను మాత్రం అందుకోవచ్చు.

ఫింగర్ ప్రింట్ సెన్సార్ అథంటికేషన్ ఫీచర్. ప్రస్తుతం ఈ ఫీచర్ వాట్సాప్ బీటా వెర్షన్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. వాట్సాప్ అకౌంట్‌ను ఇతరులు చూడకుండా, వాడకుండా ఉండేందుకు ఈ ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ ఫీచర్ పనిచేస్తుంది. యూజర్ల వాట్సాప్ అకౌంట్ భద్రత దృష్ట్యా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చామని కంపెనీ తెలిపింది. అయితే ఈ ఫీచర్‌లో ఫేస్‌ రిగక్నైజేషన్‌ లేదు. 

స్టేబుల్ వాట్సాప్ యూజర్లకు ఈ ఫేస్ రిగక్నైజేషన్ ఫీచర్‌ను ఎప్పుడు అందుబాటులోకి తెస్తుందనే దానిపై కంపెనీ క్లారిటీ ఇవ్వలేదు. ఐఫోన్ యూజర్లకు ఇప్పటికే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. ఐఫోన్ యూజర్లకు ఫింగర్ ఫ్రింట్ అథంటికేషన్ ఫీచర్ మాత్రమే కాక టచ్ ఐడీ, ఫేషియల్ రిగక్నైజేషన్‌ ఫీచర్ల ద్వారా కూడా వాట్సాప్ అన్ లాక్ అవుతుంది. 

ఆండ్రాయిడ్‌ బీటా యూజర్లు తమ వాట్సాప్ అకౌంట్ లాగిన్ కావాల్సి ఉంటుంది. సెట్టింగ్స్ ఆప్షన్ దగ్గర అకౌంట్ పై.. ఆ పై ప్రైవసీ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. యూస్‌ ఫింగర్ ఫ్రింట్ టు అన్‌లాక్‌ అప్షన్‌పై ప్రెస్ చేస్తే ఫింగర్ ప్రింట్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చేసినట్లే.