ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వాడే ఐఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్.. త్వరలో ఐఫోన్ వాట్సాప్ ఐఓఎస్ ద్వారా 2GB వరకు ఫైల్స్ పంపుకోవచ్చు. ఇప్పటివరకూ 100MB ఫైల్స్ మాత్రమే పంపుకునేందుకు వీలుంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా రానున్న రోజుల్లో 2GB వరకు ఫైల్స్ ఏమైనా ఒకరినొకరు పంపుకోవచ్చు.  

మీరు వాట్సాప్‌లో పెద్ద సైజు మీడియా ఫైల్‌ షేర్ చేస్తున్నప్పుడు చాాలాసార్లు అనుమతించిన సైజ్ కంటే ఎక్కువగా ఉందని పాప్ అప్ మెసేజ్ కనిపిస్తుంది. వాట్సాప్‌లో ఇకపై ఏకకాలంలో 2జీబీ సైజ్ వరకు మీడియా ఫైల్‌ పంపొచ్చు. అయితే బీటా టెస్టర్‌లకు మాత్రమే కొత్త ఫీచర్‌ అందుబాటులోకి రానుంది. అందరికీ అందుబాటులోకి రావాలంటే మరికొంత కాలం వేచి ఉండాల్సిందే. అయితే ఇప్పటికే ఫార్వార్డ్ వీడియోలు, ఫోటోలతో మొబైల్ బుర్ర, మీ బుర్ర హీటెక్కి పోతుంటే.. ఇకపై మరింత పెద్ద సైజు గల వీడియో ఫైల్స్ వస్తే ఎప్పటికప్పుడు డిలీట్ చేయడం తప్ప మరో గత్యంతరం లేదు.

వాట్సాప్ తన బీటా వినియోగదారులకు 2GB సైజులో ఉన్న మీడియా ఫైల్‌లను షేర్ చేయడానికి అనుమతించే ఫీచర్‌ను పరీక్షిస్తోంది. అయితే ఈ ఫీచర్ ప్రస్తుతం అర్జెంటీనాలో మాత్రమే అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లు ఇద్దరూ ఈ కొత్త ఫీచర్‌ను ఉపయోగించగలరు. అయితే, ఈ ఫీచర్ ప్రస్తుతం అర్జెంటీనాలో మాత్రమే విడుదలవుతోంది. ఇతర ప్రాంతాలు దాని కోసం వేచి ఉండవలసి ఉంటుంది.

WhatsApp 2GB సైజులో ఉన్న మీడియా ఫైల్‌ షేర్ చేయడాన్ని పరీక్షిస్తోంది! WhatsApp ఇప్పుడు అర్జెంటీనాలో 2GB పరిమాణంలో ఉన్న మీడియా ఫైల్‌లను షేర్ చేయడానికి వ్యక్తులను అనుమతించే ఒక పరీక్షను ప్రారంభిస్తోంది!" అని WABetaInfo ట్వీట్ చేసింది. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌లు హై రిజల్యూషన్ ఇమేజ్‌లు, వీడియోలను రూపొందించే అధిక మెగాపిక్సెల్ లెన్స్‌లతో వస్తున్నాయి, వాటి సైజు కారణంగా ఆయా చిత్రాలు, వీడియోలను షేర్ చేయడం కొన్నిసార్లు కష్టమవుతోంది.

Gmail కూడా 25MB సైజ్ లిమిట్ కలిగి ఉంది, అంటే మీరు ఒకేసారి 25MB కంటే ఎక్కువ సైజ్ ఫైల్ పంపలేరు. మీడియా ఫైల్‌ల కుదింపు నాణ్యత లేమికి దారితీస్తుంది. ప్రస్తుతం వాట్సాప్‌లో 100ఎంబీ వరకు మీడియా ఫైల్స్‌ను షేర్ చేసుకునేందుకు వీలు కల్పిస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఈ తాజా అప్‌డేట్‌తో మెసేజింగ్ అప్లికేషన్ యూజర్లు మీడియా ఫైల్‌లను కంప్రెస్ చేయాల్సిన అవసరం లేకుండా 2GB వరకు ఫైల్‌లను పంపగలరు.

"WhatsApp ఒక చిన్న పరీక్షను ప్రారంభిస్తోంది. కొంతమంది ఇప్పుడు 2GB వరకు మీడియా ఫైల్‌లను షేర్ చేయగలరు. ప్రస్తుతం అర్జెంటీనాలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇది నిర్దిష్ట సంఖ్యలో బీటా టెస్టర్‌లకు అందుబాటులోకి వచ్చింది.. వాట్సాప్ భవిష్యత్తులో ఇదే ఫీచర్‌ను మరింత మందికి అందించాలని యోచిస్తోందో లేదో కూడా తెలియదు, ఎందుకంటే ఇది ఒక పరీక్ష. పరీక్ష తర్వాత WhatsApp ఒకవేళ పాత పద్ధతి ప్రకారం 100 ఎంబీ లిమిట్ కొనసాగించవచ్చు. లేదా 2 జీబీ లిమిట్ ఇవ్వొచ్చు. దీనికి కాలమే సమాధానం చెబుతుంది’’ అని WABetaInfo ఒక నివేదికలో వెల్లడించింది.