వీరు తరచుగా వ్యక్తిగత సమాచారాన్ని చూడటానికి  బంధువులు లేదా పరిచయస్తుల ప్రొఫైల్‌లను సందర్శిస్తారు. ఇలాంటి పరిస్థితిలో మీ ప్రొఫైల్‌ను ఎవరు చూస్తున్నారనే దానిపై చాలా మందికి ఆసక్తి ఉంటుంది. 

ఫేస్‌బుక్ వచ్చిన తర్వాత చాలా పెద్ద మార్పులు వచ్చాయి. సమాజానికి వర్చువల్ ప్రపంచాన్ని  అందించడానికి ఈ వేదిక చాలా పనిచేసింది. ప్రపంచవ్యాప్తంగా 2.89 బిలియన్ల కంటే ఎక్కువ మంది వినియోగదారులు సోషల్ కనెక్టివిటీ కోసం ఫేస్ బుక్  (Facebook)ని ఉపయోగిస్తున్నారు. ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు వచ్చిన తర్వాత  లైఫ్ స్టయిల్ లో పెద్ద మార్పు కనిపించింది.

మరోవైపు, చాలా మంది వ్యక్తులు ఈ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఒకరిపై ఒకరు గూఢచర్యం చేయడానికి కూడా ఉపయోగిస్తారు. వీరు తరచుగా వ్యక్తిగత సమాచారాన్ని చూడటానికి  బంధువులు లేదా పరిచయస్తుల ప్రొఫైల్‌లను సందర్శిస్తారు. ఇలాంటి పరిస్థితిలో మీ ప్రొఫైల్‌ను ఎవరు చూస్తున్నారనే దానిపై చాలా మందికి ఆసక్తి ఉంటుంది. తరచుగా వినియోగదారులు అడుగుతుంటారు మీ ఫేస్ బుక్ ప్రొఫైల్‌ను ఎవరు సందర్శిస్తున్నారు ఇంకా వీక్షిస్తున్నారు అనే దాని గురించి తెలుసుకోవచ్చా? అని.. మీరు ఈ  ఈజీ ట్రిక్  సహాయంతో దాని గురించి తెలుసుకోవచ్చు..


మీ ఫేస్ బుక్ ప్రొఫైల్‌ను ఎవరు సందర్శిస్తున్నారు? తెలుసుకోవడానికి మీరు డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్ సహాయం తీసుకోవాలి.ముందుగా మీరు మీ డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్‌లో ఫేస్‌బుక్‌లోకి లాగిన్ కావాలి.

లాగిన్ చేసిన తర్వాత మీ టైమ్‌లైన్‌లో ఎక్కడైనా కుడివైపు క్లిక్ చేసి వ్యూ పేజ్ సోర్స్(view page source) పై క్లిక్ చేయండి లేదా మీరు CTRL + U కూడా నొక్కవచ్చు. దీని తర్వాత మీరు ctrl+f నొక్కడం ద్వారా సెర్చ్ బార్ లో BUDDY_IDని సెర్చ్ చేయాలి. 

BUDDY_IDతో మీరు 15 అంకెల కోడ్‌ని పొందుతారు. ఆ కోడ్‌ని కాపీ చేసి బ్రౌజర్‌లో facebook.com/profile ID (15 అంకెల కోడ్)  టైప్ చేయడం ద్వారా సెర్చ్ చేయండి. ఇప్పుడు మీ ప్రొఫైల్‌ను సందర్శించిన వ్యక్తి  ఫేస్‌బుక్  ఐ‌డి ప్రొఫైల్ నేరుగా మీ ముందు తెరవబడుతుంది. 
దీని ద్వారా మీ ఫేస్ బుక్ ప్రొఫైల్‌ని ఎవరు విజిట్ చేస్తున్నారో తెలుసుకోవచ్చు.