*వొడాఫోన్ ప్రీపెయిడ్ కష్టమర్లకు సూపర్ ఆఫర్*అమేజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ తక్కువ ధరకే 

ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్.. తమ ప్రీపెయిడ్ కష్టమర్ల కోసం ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కాకపోతే.. ఈ ఆఫర్ కేవలం 18 నుంచి 24ఏళ్ల లోపు వయసు వారికి మాత్రమే వర్తిస్తుంది. 

ఇంతకీ ఆఫర్ ఏంటంటే.. వొడాఫోన్ ప్రీపెయిడ్ కష్టమర్లు.. కేవలం రూ.499కే అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను పొంద‌వ‌చ్చు. అందుకు ఏం చేయాలంటే.. వినియోగ‌దారులు మై వొడాఫోన్ యాప్‌లోకి వెళ్లి రూ.499 చెల్లించాల్సి ఉంటుంది.

 దీంతో అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్ షిప్ ల‌భిస్తుంది. కేవ‌లం భార‌త్‌లో ఉన్న వొడాఫోన్ నెట్‌వ‌ర్క్‌ను వాడే యువ‌తీ యువ‌కుల కోస‌మే ఈ ఆఫ‌ర్‌ను అందిస్తున్న‌ట్లు ఆ సంస్థ ప్ర‌తినిధి ఒక‌రు తెలిపారు. యూత్ ఆఫ‌ర్ ఆన్ అమెజాన్ ప్రైమ్ కింద ఈ ఆఫ‌ర్‌ను అందిస్తున్న‌ట్లు తెలిపారు.

అమేజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ పొందినవారు.. కొత్త కొత్త సినిమాలు అందులో చూసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా.. అమేజాన్ ఏవైనా ఆఫర్లు ప్రకటిస్తే.. ముందుగా ప్రైమ్ మెంబర్స్ కే అవకాశం కల్పిస్తుంది.