కలర్ మార్చే ఫీచర్‌తో వివో 5G స్మార్ట్ ఫోన్.. బిగ్ స్టోరేజ్, ఫ్లాష్ ఛార్జింగ్ ఇంకా లేటెస్ట్ ఫీచర్స్ కూడా..
ఈ ఫోన్ బ్లాక్ అండ్ సెయిలింగ్ బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది. 128జిబి స్టోరేజ్ 8 జిబి ర్యామ్ ధర రూ. 35,999, 12 జిబి ర్యామ్ 256 జిబి స్టోరేజ్ ధర రూ. 39,999.
స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో (Vivo)కొత్త కెమెరా ఫోన్ Vivo V25 Pro 5Gని ఇండియాలో లాంచ్ చేసింది. Vivo V23 Pro తరువాత Vivo V25 ప్రోని తీసుకొచ్చింది. ఈ ఫోన్‌లో 64 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా సెటప్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)కి సపోర్ట్ ఉంది. అలాగే ఫోన్ బ్లాక్ అండ్ సెయిలింగ్ బ్లూ కలర్‌లో కలర్ మారుతున్న బ్యాక్ ప్యానెల్‌తో పరిచయం చేసారు. ఫోన్ 6.53-అంగుళాల 3D కర్వ్డ్ స్క్రీన్ ఉంది. ఫోన్ ఇతర స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర గురించి చూద్దాం..
వివో వి25 ప్రొ 5జి ధర
ఈ ఫోన్ బ్లాక్ అండ్ సెయిలింగ్ బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది. 128జిబి స్టోరేజ్ 8 జిబి ర్యామ్ ధర రూ. 35,999, 12 జిబి ర్యామ్ 256 జిబి స్టోరేజ్ ధర రూ. 39,999. ఈ ఫోన్‌ను కంపెనీ అధికారిక వెబ్‌సైట్ అండ్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్ నుండి కొనుగోలు చేయవచ్చు. ఆగస్ట్ 25 మధ్యాహ్నం 12 గంటలకు ఫోన్ సేల్ ప్రారంభమవుతుంది. ఈ రోజు నుండే ఫోన్‌ను ప్రీ బుక్ చేసుకోవచ్చు.
స్పెసిఫికేషన్‌లు
వివో వి25 ప్రొ 5జి కలర్ మారుతున్న బ్యాక్ అండ్ మెటల్ ఫ్రేమ్‌తో ప్రీమియం డిజైన్‌లో తీసుకొచ్చారు. Android 12 ఆధారిత Funtouch OS 12 ఫోన్‌లో ఉంది. Vivo V25 Pro 5G 6.56-అంగుళాల ఫుల్ HD ప్లస్ AMOLED 3D కర్వ్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఫోన్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్‌తో గరిష్టంగా 12జిబి వరకు LPDDR5 ర్యామ్, 256జిబి UFS 3.1 స్టోరేజ్ ఉంది. ఫోన్‌లో సేఫ్టీ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా సపోర్ట్ చేస్తుంది.
కెమెరా
వివో వి25 ప్రొ 5జిలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది, 64-మెగాపిక్సెల్ ప్రైమరీ లెన్స్, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ అండ్ 2-మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ ఉన్నాయి. ఫోన్ తో తక్కువ వెలుతురులో కూడా షార్ప్ ఫోటోలను క్లిక్ చేయవచ్చని కంపెనీ పేర్కొంది. కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) అండ్ హైబ్రిడ్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. వీడియో కాల్‌లు, సెల్ఫీల కోసం ఫోన్‌లో 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.
బ్యాటరీ
వివో V25 Pro 5G 4,830mAh బ్యాటరీ ప్యాక్ చేస్తుంది, ఇంకా 66W ఫ్లాష్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ కోసం Vivo V25 Pro 5Gలో 5G, 4G, GPS, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.2, టైప్-సి పోర్ట్ వంటి ఫీచర్లను చూడవచ్చు.