వివో ఇండియా త్వరలో 'మేడ్ ఇన్ ఇండియా' స్మార్ట్‌ఫోన్‌లను ఇతర దేశాలకు ఎగుమతి చేయడాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.ఉత్పత్తి యూనిట్ విస్తరణ కోసం 2023 నాటికి కంపెనీ రూ.3,500 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనుంది. త్వరలో స్థానికంగా చార్జర్లు, డిస్‌ప్లేలు వంటి విడిభాగాలను ఉత్పత్తి చేస్తామని వివో తెలిపింది.
ప్రముఖ గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో భారతీయ మార్కెట్‌లో వ్యాపారం గురించి పెద్ద ప్రకటన చేసింది. ఈ ఏడాది మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్‌ఫోన్‌లను ఎగుమతి చేస్తామని కంపెనీ తెలిపింది. అదనంగా, కంపెనీ తన ప్రతిపాదిత తయారీ పెట్టుబడి ప్రణాళికలో భాగంగా రూ.7,500 కోట్లను కూడా ప్రకటించింది.
ఉత్పత్తి యూనిట్ విస్తరణ కోసం 2023 నాటికి కంపెనీ రూ.3,500 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనుంది. త్వరలో స్థానికంగా చార్జర్లు, డిస్‌ప్లేలు వంటి విడిభాగాలను ఉత్పత్తి చేస్తామని వివో తెలిపింది. ఈ పెట్టుబడితో భారతదేశంలో వివో స్మార్ట్‌ఫోన్ తయారీ సామర్థ్యం 2022 చివరి నాటికి 60 మిలియన్లకు చేరుకుంటుంది.
ప్రస్తుతం దాదాపు 1.4 లక్షల మంది భారతీయులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నట్లు కంపెనీ ప్రకటన తెలిపింది. 1000 మందికి పైగా డిస్ట్రిబ్యూటర్‌లను జోడించడం ద్వారా కంపెనీ తన పంపిణీని బలోపేతం చేసింది.
ఈ ప్రకటనపై వివో ఇండియా డైరెక్టర్ (బిజినెస్ స్ట్రాటజీ) పైఘమ్ డానిష్ మాట్లాడుతూ, “ఈ పెట్టుబడితో సంస్థ భారతదేశానికి చేసిన రూ. 7500 కోట్ల నిబద్ధతలో భాగం. అయితే 2021 వరకు మొత్తం రూ.1,900 కోట్లు పెట్టుబడి పెట్టాం. మేము ఇప్పుడు భారతదేశంలో తయారు చేయబడిన అన్ని మొబైల్ మోడల్‌లను ఎగుమతి చేసే స్థాయిలో ఉన్నాము. అలాగే మేము ఎగుమతి చేసే మోడల్స్ అండ్ దేశాల మార్కెట్ డిమాండ్‌పై ఆధారపడి ఉంటాయి. ప్రతిపాదిత పెట్టుబడి ప్రణాళికలు భారతదేశంలో 40,000 కొత్త ఉద్యోగాలను సృష్టించగలవని అని అన్నారు.
వివో 2014లో భారత మార్కెట్లోకి ప్రవేశించింది. తాజాగా నివేదిక ప్రకారం వివో మెయిన్‌లైన్ రిటైల్‌లో బలమైన పట్టును కొనసాగించింది అలాగే 2021లో 25% మార్కెట్ వాటాను సాధించింది. వివో దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలలో 100 మిలియన్ల కంటే ఎక్కువ మంది కస్టమర్‌లను కలిగి ఉంది. వివోకి గ్రేటర్ నోయిడాలో తయారీ కర్మాగారం ఉంది.
