Vivo T1 5G vs Vivo T1 Pro 5G: ఈ రెండు ఫోన్‌ల మధ్య తేడా ఏంటి, ఏది బెస్ట్ ఫోన్..?

బడ్జెట్‌లో ట్రెండీ డిజైన్‌తో టర్బో పర్ఫర్మెంస్, కెమెరాతో ఫాస్ట్ ఛార్జింగ్  కోసం చూసే వారికోసం ఈ రెండు ఫోన్‌లను  పరిచయం చేసింది. ఇప్పుడు వివో T సిరీస్  కింద మూడు స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి.

Vivo T1 5G vs Vivo T1 Pro 5G: What is the difference between the two phones, which is the best phone

స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో (Vivo) ఇండియాలో  టి (T) సిరీస్  కింద  వివో టి1 ప్రొ 5జి(vivo T1 pro 5G), వివో టి1  (vivo T1)44W పేరుతో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. బడ్జెట్‌లో ట్రెండీ డిజైన్‌తో టర్బో పర్ఫర్మెంస్, కెమెరాతో ఫాస్ట్ ఛార్జింగ్  కోసం చూసే వారికోసం ఈ రెండు ఫోన్‌లను  పరిచయం చేసింది. ఇప్పుడు వివో T సిరీస్  కింద మూడు స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. గతంలో వివో టి1 5G ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టారు. Vivo T1 5G, Vivo T1 Pro 5G మధ్య మీకు ఏది బెస్ట్ తెలుసుకొండి..

 ధర 
వివో టి1 ప్రొ 5G 6జి‌బి ర్యామ్‌తో 128 జి‌బి స్టోరేజ్ ధర రూ. 23,999. 8జి‌బి ర్యామ్ తో 128 జి‌బి స్టోరేజ్ ధర రూ. 24,999. ఈ ఫోన్‌ను టర్బో బ్లాక్, టర్బో సియాన్ కలర్‌లో కొనుగోలు చేయవచ్చు.

వివో టి1 5G ధర రూ. 15,990. ఈ ధర వద్ద, 4 జి‌బి ర్యామ్ తో 128జి‌బి స్టోరేజ్  ఉంటుంది. ఈ ఫోన్ 6జి‌బి + 128జి‌బి అండ్ 8జి‌బి + 128జి‌బి మోడల్‌లలో కూడా అందించనున్నారు, వీటి ధరలు రూ. 16,990 అండ్ రూ. 19,990 నుండి ప్రారంభమవుతాయి. రాంబో ఫాంటసీ, స్టార్‌లైట్ బ్లాక్ కలర్‌లో ఈ ఫోన్ పరిచయం చేసారు.

స్పెసిఫికేషన్‌లు
వివో టి1 ప్రొ 5Gలో Android 12 ఆధారిత Funtouch OS 12, 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.44-అంగుళాల పూర్తి HD ప్లస్ AMOLED డిస్‌ప్లే, 8జి‌బి వరకు LPDDR4X ర్యామ్, 8 లేయర్ లిక్విడ్ కూల్ టెక్నాలజీతో స్నాప్‌డ్రాగన్ 778G ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 4D గేమ్ వైబ్రేషన్‌తో పాటు Z-యాక్సిస్‌పై లీనియర్ మోటార్‌ ఉంది. గేమింగ్ కోసం అల్ట్రా గేమ్ మోడ్ అండ్ మల్టీ టర్బో 5.5 కూడా ఉన్నాయి. ఫోన్‌లో ర్యామ్ 2.0 కూడా ఉంది, దీని వల్ల ర్యామ్‌ను 4 జిబి వరకు పెంచుకోవచ్చు.

వివో టి1 5Gలో Android 12 ఆధారిత FunTouch OS 12 ఇచ్చారు.  1080x2408 పిక్సెల్‌ల రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.58-అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే ఉంది. స్నాప్‌డ్రాగన్ 695 5G ప్రాసెసర్‌ని ఇచ్చారు, 8 జి‌బి వరకు ర్యామ్, 128 జి‌బి వరకు స్టోరేజ్ ఉంది.

 కెమెరా
వివో టి1 ప్రొ 5Gలో మూడు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి, దీని  ప్రైమరీ లెన్స్ 64 మెగాపిక్సెల్‌లు, ఎపర్చరు f/1.79 ఉంది. ఇందులో రెండవ లెన్స్ 8 మెగాపిక్సెల్స్ అల్ట్రా వైడ్, మూడవ లెన్స్ 2 మెగాపిక్సెల్స్ మాక్రో లెన్స్. సెల్ఫీల కోసం 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.
వివో టి1 5Gలో మూడు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి, దీనిలో ప్రైమరీ లెన్స్ 50 మెగాపిక్సెల్‌లు, ఎపర్చరు f / 1.8 ఉంది. మిగిలిన రెండు లెన్స్‌లు 2-2 మెగాపిక్సెల్‌లు. ముందు భాగంలో 16-మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు, ఎపర్చరు f / 2.0 ఉంది. సూపర్ నైట్ మోడ్ అండ్ మల్టీ-స్టైల్ పోర్ట్రెయిట్ మోడ్ ఫోన్  6జి‌బి అండ్ 8జి‌బి ర్యామ్ మోడల్‌లతో అందుబాటులో ఉంటాయి.

బ్యాటరీ
కనెక్టివిటీ కోసం, వివో టి1 ప్రొ 5Gలో 5G, 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్ v5.2, GPS / A-GPS, USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఫోన్‌లో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. 66W ఫ్లాష్‌ఛార్జ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ తో 4700mAh బ్యాటరీ ఉంది. ఫోన్ బరువు 180.3 గ్రాములు.

వివో టి1 5జిలో కనెక్టివిటీ కోసం, 5G, 4G LTE, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ v5.1, USB టైప్-C పోర్ట్, USB OTGకి సపోర్ట్ ఉంటుంది. ఫోన్‌లో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ తో 5000mAh బ్యాటరీ పొందుతుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios