బీఎస్ఎన్ఎల్ నుంచి టక్కర్ ప్లాన్..! జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఇప్పుడు ఏం చేయబోతున్నాయి?
దేశంలోని నాలుగు ప్రముఖ కంపెనీలు ఇండియా అంతటా టెలికాం సేవలను అందిస్తున్నాయి. జియో, ఎయిర్‌టెల్ సహా వొడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ కంపెనీలతో పోటీపడటానికి ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ టక్కర్ ప్లాన్ తో ముందుకొచ్చింది.
దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా వంటి కంపెనీలు రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచుతూ ప్రకటించగా ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ మాత్రం రీఛార్జ్ ప్లాన్ ధరలను తగ్గించి కొత్త ప్లాన్‌ను విడుదల చేసింది. దేశంలోని నాలుగు ప్రముఖ కంపెనీలు ఇండియా అంతటా టెలికాం సేవలను అందిస్తున్నాయి. జియో, ఎయిర్‌టెల్ సహా వొడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ కంపెనీలతో పోటీపడటానికి BSNL ముందుకొచ్చింది. ఇతర కంపెనీలు రీఛార్జ్ ప్లాన్ల ధరలను 12 నుండి 27 శాతం పెంచగా.. బీఎస్ఎన్ఎల్ మాత్రం కస్టమర్ల కోసం ఒక అద్భుతమైన ప్లాన్‌ను ప్రకటించింది.
BSNL రూ.249 కొత్త ప్లాన్ 45 రోజుల వాలిడిటీ అందిస్తుంది. ఇంకా దేశవ్యాప్తంగా ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఫ్రీ. రోజుకు 2GB చొప్పున మొత్తం 90GB డేటా కూడా లభిస్తుంది. అంతేకాదు మీరు రోజుకు 100 SMSలను ఉచితంగా పంపవచ్చు.
కనీస రీఛార్జ్
టెలికాం కంపెనీల ధరల పెంపు తర్వాత, రిలయన్స్ జియో రూ.189 కనీస రీఛార్జ్ ప్లాన్‌ను అందిస్తోంది. దీని వాలిడిటీ 28 రోజులు. Airtel ఇంకా Vodafone Idea అదే వ్యాలిడిటీతో రూ. 199 కనీస రీఛార్జ్ ప్లాన్‌ను అందిస్తున్నాయి.