TRAI report:ఇంటర్నెట్ డౌన్‌లోడ్‌ స్పీడులో జియోనే టాప్, అప్‌లోడ్‌ లో వొడాఫోన్ ఐడియా అగ్రస్థానం..

జియో కాకుండా ప్రభుత్వ సంస్థ బ్స్న మాత్రమే ఇంటర్నెట్ స్పీడ్ పెంచింది. దీని 4జి డౌన్‌లోడ్ స్పీడ్ ఫిబ్రవరిలో 4.8 ఎం‌బి‌పి‌ఎస్ నుండి మార్చిలో 6.1 ఎం‌బి‌పి‌ఎస్ కి పెరిగింది.
 

TRAI report: Jio in downloading, Vodafone Idea on top in uploading

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కొత్త నివేదిక ప్రకారం రిలయన్స్ జియో మార్చి 2022లో 4G డౌన్‌లోడ్ స్పీడ్‌లో టాప్ లో నిలిచింది. మార్చి నెలలో TRAI విడుదల చేసిన డేటా ప్రకారం, Jio ఆవరేజ్ 4G డౌన్‌లోడ్ స్పీడ్ 21.1 Mbpsగా ఉంది. అంటే ఫిబ్రవరి నెలతో పోలిస్తే 0.5 Mbpsపెరిగింది.

ఫిబ్రవరిలో Jio ఆవరేజ్ 4G డౌన్‌లోడ్ స్పీడ్ 20.6 Mbpsగా ఉంది. జియో కాకుండా ప్రభుత్వ సంస్థ BSNL మాత్రమే స్పీడ్ పెంచింది. దీని 4G డౌన్‌లోడ్ స్పీడ్ ఫిబ్రవరిలో 4.8 Mbps నుండి మార్చిలో 6.1 Mbps వద్ద చేరింది.

టెలికాం దిగ్గజాలు ఎయిర్‌టెల్ అండ్ వి‌ఐ (vodafone-idea) 4G స్పీడ్ మార్చిలో పడిపోయిందని డేటా చూపిస్తుంది. ఇందులో ఎయిర్‌టెల్ చాలా నష్టపోయింది, దాని 4G డౌన్‌లోడ్ స్పీడ్ గత నెలతో పోలిస్తే మార్చిలో 1.3 Mbps తగ్గింది.  అలాగే స్పీడ్ పరంగా Vi కూడా 0.5 Mbps తగ్గుదల చవిచూసింది. ఎయిర్‌టెల్ వేగం 13.7 Mbps కాగా Vi ఇండియా వేగం 17.9 Mbps. 

మార్చి నెలలో జియో 4G డౌన్‌లోడ్ స్పీడ్ Airtel కంటే 7.4 mbps ఇంకా Vi India కంటే 3.2 mbps ఎక్కువ. రిలయన్స్ జియో గత కొన్ని సంవత్సరాలుగా ఆవరేజ్ 4G డౌన్‌లోడ్ స్పీడ్ నిలకడగా మొదటి స్థానంలో ఉంది. Vi India రెండవ స్థానంలో కొనసాగుతుండగా, Airtel మూడవ స్థానంలో ఉంది.

డౌన్‌లోడ్‌ల వంటి ఆవరేజ్ 4G అప్‌లోడ్ స్పీడ్ లో భారతీ ఎయిర్‌టెల్ కూడా మూడవ స్థానంలో ఉంది. మార్చి నెలలో కంపెనీ ఆవరేజ్ అప్‌లోడ్ స్పీడ్ 6.1 Mbpsగా ఉంది. Vi India 8.2 Mbpsతో ఆవరేజ్ 4G అప్‌లోడ్ స్పీడ్ తో చార్ట్‌లో అగ్రస్థానంలో ఉంది. రిలయన్స్ జియో 7.3 Mbps అప్‌లోడ్ స్పీడ్ తో రెండవ స్థానం గెలుచుకుంది. BSNL కూడా 5.1 Mbps ఆవరేజ్ అప్‌లోడ్ స్పీడ్ తో పోటీ పడేందుకు ఉత్తమంగా ప్రయత్నించింది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios