Asianet News TeluguAsianet News Telugu

బీ రెడీ: రూ.10 వేల లోపు స్మార్ట్ ఫోన్లు ఇవే


స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది.. కానీ వారి కుటుంబ బడ్జెట్ అనుమతించక పోవచ్చు.. టైట్ బడ్జెట్ ఉన్న వారు తక్కువ రేంజీలో అంటే రూ.10 వేల లోపు విలువ గల స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేసేందుకు మార్గం ఉంది. పలు కంపెనీలు మధ్య తరగతి ప్రజలే లక్ష్యంగా చౌక ధరలకే స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి తెస్తున్నాయి. ఒక్కసారి ఆయా ఫోన్లలో ఫీచర్లు, వాటి ధరలు తెలుసుకోవడమే ఆలస్యం. ఇష్టమైన స్మార్ట్ ఫోన్ సొంతం చేసుకోవచ్చు. 

Top Five Smartphones to Buy in India Under Rs 10,000
Author
New Delhi, First Published Sep 3, 2019, 11:03 AM IST

న్యూఢిల్లీ: ప్రీమియం, ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు విపణిలో తప్పకుండా ముందుకు వెళతాయి. అయితే ప్రత్యేకించి భారత్ వంటి మార్కెట్‌లో బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్ల విక్రయాలు గణనీయంగానే సాగుతాయి. ఆకర్షణీయమైన ఫీచర్లతో రూపుదిద్దుకున్న స్మార్ట్‌ఫోన్లు ఖచ్చితంగా వినియోగదారుల మనస్సు దోచుకుంటాయి. హై రిజల్యూషన్ డిస్ ప్లేతోపాటు గొప్ప సామర్థ్యం గల కెమెరాలు, పూర్తిగా పనిచేసే సామర్థ్యం గల హార్డ్‌వేర్ కలిగి ఉండటంతోపాటు రూ.10 వేల లోపు ధర గల ఫోన్లు విరివిగానే అమ్ముడవుతాయి. చౌక ధరకు అంటే రూ.10 వేల లోపు విలువ గల స్మార్ట్‌ఫోన్లు  అందుబాటులో ఉన్నాయి. ఆయా ఫోన్లను ఒక్కసారి పరిశీలిద్దాం..

షియోమీ రెడ్ మీ నోట్ ‘7ఎస్’లోనూ నోట్ 7 ఫీచర్లే
గత మే నెలలో రెడ్‌మీ నోట్ 7ఎస్ ప్రకటించింది. రెడ్ మీ నోట్ 7 మోడల్ ఫోన్‌లో ఉన్న ఫీచర్లే ‘నోట్ 7ఎస్’ ఫోన్‌లో లభిస్తాయి. 7ఎస్ ఫోన్‌లో మెరుగైన లక్షణాలు గల కెమెరా ఉన్నాయి. మిగతా ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ ఒరిజినల్‌గానే ఉంటాయి. 

రెడ్ మీ నోట్ ‘7ఎస్’కు గొరిల్లా గ్లాస్ -5 ప్రొటెక్షన్
షియోమీ రెడ్ మీ నోట్ 7ఎస్ హ్యాండ్ సెట్ 6.3 అంగుళాలతో ఫుల్ హెచ్‌డీ (2340 x 1080 పిక్సెల్స్) డిస్ ప్లే, డాట్ నాచ్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కలిగి ఉంటుంది. ఇది 3జీబీ విత్ 23 జీబీ, 4 జీబీ విత్ 64 జీబీ ర్యామ్ వేరియంట్లతో ఖ్వాల్ కాలం స్నాప్ డ్రాగన్ 660 ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో పని చేస్తూ ఉంటుంది. మైక్రో ఎస్డీ కార్డుతో దీని నిల్వ సామర్థ్యం 256 జీబీకి పెంచుకోవచ్చు. 

రెడ్ మీ నోట్ ‘7ఎస్’లో ఎఐ ఫీచర్లు ఇలా
రెడ్ మీ నోట్ 7 ఫోన్ 12 మెగా పిక్సెల్ సెన్సర్ విత్ సెకండరీ 2-మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్ కలిగి ఉంటుంది. కానీ ఇప్పుడు 48 మెగా పిక్సెల్ సెన్సర్ విత్ 5-మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్‌తో అందుబాటులో ఉంటుంది. ఫ్రంట్ 13 మెగా పిక్సెల్ కెమెరా వర్షన్, కెమెరా పనితీరు పెంపొందించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) సాఫ్ట్ వేర్ ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. 

మూడు రంగుల్లో రెడ్ మీ నోట్ ‘7ఎస్’ లభ్యం
ఇందులో క్విక్ చార్జ్ 4.0 సపోర్ట్‌తో 4000 ఎంఎహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ కూడా నిర్మించారు. రేర్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జాక్, వై-ఫై5, పీ2ఐ స్ప్లాష్ -రిసిస్టెంట్ కోటింగ్, బ్లూ టూత్ 5.0, ఆండ్రాయిడ్ పై 9.0, ఎంఐయుఐ10తో నడుస్తుంది. ఈ ఫోన్ ఓన్యిక్స్ బ్లాక్, రూబీ రెడ్, సఫైర్ బ్లూ రంగుల్లో లభిస్తుంది. 

గొరిల్లా గ్లాస్ -3 ప్లస్ వాటర్ డ్రాప్ నాచ్ సెక్యూరిటీతో రియల్ మీ 5
విపణిలోకి నూతనంగా అడుగు పెట్టిన ఫోన్ రియల్ మీ 5. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్లస్, వాటర్ డ్రాప్ నాచ్‌తోపాటు 6.5 అంగుళాల హెచ్ డీ + (720x1600 పిక్సెల్స్) డిస్ ప్లే తో డిజైన్ చేసిన ఫోన్ ఇది. ఖ్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్, 128 ఇంటర్నల్ స్టోరేజీ సామర్థ్యంతోపాటు 4జీబీ రామ్ సామర్థ్యం ఈ ఫోన్ సొంతం. 

‘ఆండ్రాయిడ్ 9.0పై’తో రియల్ మీ 5 ఫోన్ 
మైక్రో యూఎస్బీ పోర్ట్, రేర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 4జీ వోల్ట్, వై-ఫై, బ్లూటూత్ వీ 5.0, జీపీఎస్/ఎ- జీపీఎస్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కలిగి ఉంటుంది. 5000 ఎంఎహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ కలిగి ఉన్న ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 9.0పై, కలర్ ఓఎస్ 6.0తో పని చేస్తుంది. 

రెండు రంగుల్లో రియల్ మీ 5 ఫోన్ లభ్యం ఇలా
క్రిస్టల్ బ్లూ, క్రిస్టల్ పర్సుల్ రంగుల్లో లభిస్తుంది. రియల్ మీ 5 ఫోన్ 3జీబీ విత్ 32 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.9999, 4జీబీ విత్ 64 జీబీ స్టోరేజీ సామర్థ్యం గల ఫోన్ ధర రూ.10,999, 4జీబీ విత్ 128 జీబీ స్టోరేజీ సామర్థ్యం గల ఫోన్ రూ.11,999లకు లభిస్తుంది. 

ఎఐ ప్లస్ ఆటో హెచ్డీఆర్ షియోమీ రెడ్ మీ వై3 సొంతం

రెడ్ మీ వై3 ఫోన్ పూర్తిగా మిడ్ రేంజ్ ఖ్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 632 ఎస్వోసీతో రూపుదిద్దుకున్నది. 3జీబీ విత్ 32 జీబీ స్టోరేజీ, 4 జీబీ విత్ 64 జీబీ స్టోరేజీ సామర్థ్యంతో రూపుదిద్దుకున్న ఈ ఫోన్‌లో 32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. రెడ్ మీ వై3 ఫోన్‌లో అద్భుతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) ఫీచర్, ఆటో హెచ్‌డీఆర్ దీని సొంతం. 

4000 ఎంఎహెచ్ సామర్థ్యం గల బ్యాటరీతో షియోమీ రెడ్ మీ 
గూగుల్ లెన్స్ ఇంటెగ్రేషన్‌తోపాటు 12 మెగా పిక్సెల్ ప్లస్ 2 మెగా పిక్సెల్ డ్యూయల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంది ఈ ఫోన్. ఇందులో 4000 ఎంఎహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ, 6.26 అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్ ప్లే ఉన్నాయి. 3జీబీ రామ్ సామర్థ్యం గల ఫోన్ రూ.8999, 4జీబీ వేరియంట్ సామర్థ్యం గల ఫోన్ రూ.11,999లకు లభిస్తుంది. ఎలిగెంట్ బ్లూ, బోల్డ్ రెడ్, ప్రైమ్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ లభ్యమవుతుంది. 

మూడు వేరియంట్లలో అసుస్ జెన్ ఫోన్ మ్యాక్ ప్రో ఎం2

అసుస్ జెన్ ఫోన్ మ్యాక్ ప్రో ఎం2 ఫోన్ 6.26 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ స్క్రీన్ కలిగి ఉంటుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 660 ఎస్వోసీ ప్రాసెసర్‌తో పని చేసే ఈ ఫోన్ మూడు వేరియంట్లలో లబిస్తుంది. 3జీబీ ర్యామ్ ప్లస్ 32 జీబీ స్టోరేజీ, 4జీబీ ర్యామ్ ప్లస్ 64 జీబీ ర్యామ్, 6జీబీ ప్లస్ 64 జీబీ స్టోరేజీ సామర్థ్యం గల వేరియంట్లలో లభ్యమవుతుంది. 

రెండు కలర్స్‌లో అసుస్ జెన్ ఫోన్ మ్యాక్ ప్రో ఎం2 లభ్యం
ఆండ్రాయిడ్ 8.1తోపాటు 5000 ఎంఎహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ 12 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తోపాటు డ్యూయల్ రేర్ కెమెరా, 12 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఫ్లస్ ఫ్రంట్ ఎల్ఈడీ ఫ్లాష్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 ఫీచర్ లభిస్తుంది. బ్లూ, టైటానియం రంగుల్లో లభిస్తుంది. 

ఎక్స్య్‌నోస్ 7904 ప్రాసెసర్‌తో శామ్‌సంగ్ గెలాక్సీ ఎం20
శామ్ సంగ్ గెలాక్సీ ఎం 20 ఫోన్ 6.2 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ (2340x1080 పిక్సెల్స్) రిజల్యూషన్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఎక్స్య్ నోస్ 7904 ప్రాసెసర్, 3జీబీ అండ్ 4జీబీ రామ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. 13 మెగా పిక్సెల్ కెమెరా ప్రైమరీ సెన్సర్, 5 మెగా పికక్సెల్ సెకండరీ సెన్సర్‌తోపాటు 5000 ఎంఎహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ దీని సొంతం. ఆండ్రాయిడ్ 8.1పై ఇంటర్ పేస్ ఆధారిత శామ్‌సంగ్ ఎక్స్‌పీరియన్స్ వర్షన్ 9.5 యూఎక్స్ వినియోగంలోకి వస్తుంది. 512 జీబీ ర్యామ్ వరకు విస్తరించగల సామర్థ్యంతోపాటు డ్యూయల్ సీఎం ఓల్ట్ సపోర్ట్ కలిగి ఉంటుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios