క్యూఎల్‌ఈడి ప్యానెల్‌తో థామ్సన్ కొత్త స్మార్ట్ టీవీలు.. బడ్జెట్ ధరకే బెస్ట్ ఫీచర్స్
థామ్సన్ ఈ టీవీలను బెజెల్-లెస్ డిజైన్‌తో పరిచయం చేసింది. థామ్సన్ ఈ మూడు టివిలలో 50 అంగుళాలు, 55 అంగుళాలు ఇంకా 65 అంగుళాలు ఉన్నాయి. థామ్సన్ ఈ టీవీలన్నీ కూడా ఫ్లిప్‌కార్ట్ అప్ కమింగ్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో విక్రయించనుంది.
ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ థామ్సన్ మూడు కొత్త స్మార్ట్ టీవీలను ఒకేసారి భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. థామ్సన్ నుండి వస్తున్న ఈ టీవీలకి QLED ప్యానెల్ అందించారు. అంతేకాకుండా, గూగుల్ టివి అన్ని టీవీలలో సపోర్ట్ చేస్తుంది. అలాగే డాల్బీ విజన్ కాకుండా హెచ్‌డిఆర్10+, డాల్బి అట్మస్, డాల్బి డిజిటల్ ప్లస్, డిటిఎస్ ట్రు సరౌండ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
థామ్సన్ ఈ టీవీలను బెజెల్-లెస్ డిజైన్‌తో పరిచయం చేసింది. థామ్సన్ ఈ మూడు టివిలలో 50 అంగుళాలు, 55 అంగుళాలు ఇంకా 65 అంగుళాలు ఉన్నాయి. థామ్సన్ ఈ టీవీలన్నీ కూడా ఫ్లిప్‌కార్ట్ అప్ కమింగ్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో విక్రయించనుంది. అలాగే ఈ టీవీలు 40W డాల్బీ ఆడియో స్టీరియోతో వస్తాయి. అంతేకాకుండా, 2 జిబి ర్యామ్, 16జిబి ర్యామ్ తో డ్యూయల్ బ్యాండ్ (2.4+5) GHz వై-ఫైకి సపోర్ట్ ఉంది. 4K రిజల్యూషన్ అన్ని టీవీలలో ఉంటుంది.
థామ్సన్ క్యూఎల్‌ఈడి టీవీ ధర అండ్ ఫీచర్లు
థామ్సన్ క్యూఎల్‌ఈడి టివి 50 అంగుళాల ధర రూ. 33,999, 55 అంగుళాల టివి ధర రూ. 40,999, 65 అంగుళాల టివి ధర రూ. 59,999. థామ్సన్ ఈ టీవీలన్నీ మేక్ ఇన్ ఇండియా థామ్సన్ బ్రాండ్ లైసెన్సీ కంపెనీ అయిన ఎస్‌ఎస్‌పిఎల్ ద్వారా తయారు చేసింది.
యాప్స్ కోసం గూగుల్ ప్లే స్టోర్ సపోర్ట్ ఉంది. అంతేకాకుండా, థామ్సన్ ఈ టీవీల ద్వారా స్మార్ట్ హోమ్ డివైజెస్ ని కూడా కంట్రోల్ చేయవచ్చు. ఈ టీవీలు 10000 కంటే పైగా యాప్స్ అండ్ గేమ్స్ కి సపోర్ట్ చేస్తాయి ఇంకా Netflix, Prime Video, Hotstar, Zee5, Apple TV, Voot, Sony Liv ఇంకా 5,00,000 కంటే ఎక్కువ టీవీ షోలు చూడవచ్చు.
థామ్సన్ 2018లో కూడా భారత మార్కెట్లోకి ప్రవేశించింది. అప్పటి నుండి కంపెనీ స్మార్ట్ టీవీల నుండి వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కూలర్లు ఇంకా ఎన్నో రకాల ఎయిర్ కండీషనర్‌లను కూడా లాంచ్ చేసింది.