వాట్సాప్‌లో వస్తున్న మరో అద్భుతమైన ఫీచర్.. యూజర్లు ఏళ్ల తరబడి ఈ ఫిఛర్ కోసం వేటింగ్..

వాట్సప్ ఫీచర్ ట్రాకర్ WABetaInfo వాట్సాప్ ఈ కొత్త ఫీచర్ గురించి సమాచారం అందించింది. ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్ వాట్సాప్ పోల్ ఫీచర్‌ను పరీక్షిస్తోందని నివేదికలో పేర్కొంది.

This amazing feature is coming in WhatsApp, users were waiting for years

మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మల్టీమీడియా మెసేజింగ్ యాప్   వాట్సప్ (WhatsApp) ఇప్పుడు కొత్త ఫీచర్‌పై పని చేస్తోంది. వాట్సప్ ఫీచర్ ట్రాకర్ WABetaInfo వాట్సాప్ ఈ కొత్త ఫీచర్ గురించి సమాచారం అందించింది. ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్ వాట్సాప్ పోల్ ఫీచర్‌ను పరీక్షిస్తోందని నివేదికలో పేర్కొంది. పోల్ కాకుండా, వాట్సప్ ఎమోజి ఫీచర్‌ను కూడా పరీక్షిస్తోంది, దీని  తర్వాత వినియోగదారులు ఎమోజీ ద్వారా మెసేజ్ కి ప్రతిస్పందించగలరు.

కొత్త అప్‌డేట్ తర్వాత వాట్సాప్ గ్రూప్‌లో పోల్ సదుపాయం అందుబాటులోకి వస్తుంది. ఈ ఫీచర్ ఇప్పటికే టెలిగ్రామ్‌లో ఉందని గమనించాలి. వాట్సాప్ పోల్ ఫీచర్ మొదట బీటా వెర్షన్‌లో కనిపించింది. WhatsApp పోల్ ఫీచర్ ప్రస్తుతం iOS వెర్షన్‌లో పరీక్షించబడుతోంది. అందరి కోసం కొత్త ఫీచర్ ఎప్పుడు విడుదల చేయబడుతుందనే దాని గురించి సమాచారం లేదు. WABetaInfo కొత్త ఫీచర్  స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్ చేసింది.


స్క్రీన్‌షాట్ ప్రకారం, గ్రూప్ అడ్మిన్ పోల్‌ను ప్రారంభించవచ్చు తరువాత ఇతర సభ్యులు అందులో పాల్గొనగలరు. కొత్త పోల్ ఫీచర్ కూడా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయబడుతుందని నివేదిక తెలిపింది. Facebook Messenger, Telegramలో ఇప్పటికే పోల్ ఫీచర్‌ ఉన్నాయి.

వాట్సాప్ గత వారం డెస్క్‌టాప్ బీటా వెర్షన్ కోసం కొత్త అప్‌డేట్‌ను విడుదల చేసింది, ఆ తర్వాత వాట్సాప్ డెస్క్‌టాప్ వినియోగదారులు ఫోన్‌కు ఇంటర్నెట్ కనెక్షన్ లేనప్పుడు కూడా మెసేజెస్ పంపగలరు అలాగే స్వీకరించవచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే, ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్‌లో వాట్సాప్‌ను ఉపయోగించడానికి ఫోన్‌కు ఇంటర్నెట్ అవసరం ఉండనవసరం లేదు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios