Asianet News TeluguAsianet News Telugu

ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా.. ఈ వెబ్‌సైట్‌లలో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ కంటే చాలా తక్కువ ధరకే లభిస్తాయి..

ఆన్‌లైన్ షాపింగ్ కోసం ఎన్నో పోర్టల్‌లు ఉన్నాయని మీకు తెలుసా, అవి ఫ్లిప్‌కార్ట్ ఇంకా అమెజాన్ కంటే తక్కువ ధరకే ఉత్పత్తులను అందిస్తున్నాయి. బడ్జెట్ ధరలో బెస్ట్ ఉత్పత్తులను విక్రయించే ఇ-కామర్స్ వెబ్‌సైట్ గురించి మీకు సమాచారం కావాలంటే ఈ వార్త మీ కోసం. 

These websites are many times cheaper than Flipkart and Amazon  goods are available for so little
Author
Hyderabad, First Published Aug 8, 2022, 2:37 PM IST

కరోనా తర్వాత కూడా ఇండియాలో ఆన్‌లైన్ షాపింగ్ క్రేజ్ పెరిగింది. భారతదేశంలో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ని చాలా ఎక్కువగా  ఇష్టపడుతుంటారు, అయితే ఆన్‌లైన్ షాపింగ్ కోసం ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ కాకుండా ఎన్నో ఆన్‌లైన్ పోర్టల్‌లు ఉన్నాయని మీకు తెలుసా, ఇవి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ కంటే తక్కువ ధరకే ఉత్పత్తులను అందిస్తున్నాయి. బడ్జెట్ ధరలో బెస్ట్ ప్రాడెక్ట్స్ విక్రయించే ఇ-కామర్స్ వెబ్‌సైట్ గురించి మీకు సమాచారం కావాలంటే, ఈ వార్త మీ కోసం. చౌకైన ఇంకా మంచి నాణ్యమైన ఉత్పత్తులను అందించే ఇ-కామర్స్ వెబ్‌సైట్ గురించి చూద్దాం...

ఈ ఇ-కామర్స్ వెబ్‌సైట్ బడ్జెట్ ధరకే మంచి నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తుంది. ఈ వెబ్‌సైట్ ని  మీరు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లతో పోలిస్తే తక్కువ ధరకే వస్తువులను కొనుగోలు చేయవచ్చు. ఇంకా మీరు ఎన్నో ఉత్పత్తుల గొప్ప రేంజ్ చూడవచ్చు.

మీషో నుండి మొదటిసారి కొనుగోలు చేసినప్పుడు మీకు రూ. 100 ఇన్స్టంట్ తగ్గింపు లభిస్తుంది, అంటే మీరు రూ. 300 విలువైన ఏదైనా ప్రాడక్ట్ కొనుగోలు చేస్తే మీరు మీషోలో మొదటిసారి 200 రూపాయలు మాత్రమే చెల్లించాలి. ఇతర ఇ-కామర్స్ వెబ్‌సైట్ అండ్ మార్కెట్ కంటే దాదాపు 30 శాతం తక్కువ ధరకు ఈ ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లో మంచి ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. 

మీషో లాగానే షాప్‌ మీలో బడ్జెట్ ధరకే ఎన్నో ఉత్పత్తులు ఉన్నాయి. మీరు బెస్ట్ తగ్గింపుతో షాప్‌ మీలో ఫ్యాషన్, వాచీలు, ఎలక్ట్రానిక్స్, బ్యూటీ అండ్ పెర్ఫ్యూమ్, ఫుట్‌వేర్ వంటి ఉత్పత్తులను చూడవచ్చు. మీరు ఈ ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా  చూస్తారు. అలాగే, మీరు ప్రాడక్ట్ రివ్యూ కూడా చదవవచ్చు, తద్వారా మీరు దాని నాణ్యత గురించి ఒక ఆలోచనను పొందవచ్చు.

Follow Us:
Download App:
  • android
  • ios