ఆపిల్ ఫోల్డబుల్ ఐఫోన్.. కానీ ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే..
Xiaomi, Oppo, Samsung, OnePlus, Vivo ఫోల్డబుల్ ఫోన్‌లతో మార్కెట్లోకి ఇప్పటికే ఎంట్రీ ఇచ్చాయి. దీన్ని అధిగమించేందుకు ఆపిల్ త్వరలో ఫోల్డబుల్ ఐఫోన్‌ను ప్రవేశపెడుతుందని భావించారు.
ఫోల్డబుల్ డిస్‌ప్లేతో కూడిన ఫోన్‌లను అభివృద్ధి చేయడంలో ఆపిల్ ప్రారంభ దశలో ఉందని గతంలో వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా చెప్పనప్పటికి ఆపిల్ ఫోల్డబుల్ ఫోన్స్ పేటెంట్ల కోసం దరఖాస్తు చేసింది. అయితే ఆపిల్ ఫోల్డబుల్ ఐఫోన్స్ మార్కెట్లోకి ఇప్పట్లో వచ్చే సూచనలు లేవని కొత్త నివేదికలు చెబుతున్నాయి.
Xiaomi, Oppo, Samsung, OnePlus, Vivo ఫోల్డబుల్ ఫోన్‌లతో మార్కెట్లోకి ఇప్పటికే ఎంట్రీ ఇచ్చాయి. దీన్ని అధిగమించేందుకు ఆపిల్ త్వరలో ఫోల్డబుల్ ఐఫోన్‌ను ప్రవేశపెడుతుందని భావించారు. అయితే ఆపిల్ మొట్టమొదటి ఫోల్డబుల్ ఫోన్ 2027 వరకు మార్కెట్లోకి రాదని మార్కెట్ పరిశోధన సంస్థ ట్రెండ్‌ఫోర్స్ నివేదించింది. అయితే ఫోల్డబుల్ ఐఫోన్ మార్కెట్ లో భారీ సెన్సేషన్ సృష్టిస్తుందనడంలో సందేహం లేదు. ఫోల్డబుల్ ఐఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేయడానికి ముందు ప్రోడక్ట్ టెక్నాలజీ నిర్మాణాన్ని అందించడానికి ఆపిల్ పరిశోధనలు చేస్తున్నట్లు సూచనలు ఉన్నాయి. ఆపిల్ కంపెనీ ఫోల్డబుల్ ఫోన్స్ కోసం బెస్ట్ పర్ఫార్మెన్స్ అందించేందుకు ప్రయత్నిస్తోంది.
ఫోల్డబుల్ ఐఫోన్ 2027లో వస్తుందని ట్రెండ్‌ఫోర్స్ నివేదిక పేర్కొంది. Apple ఫోల్డబుల్ ఫోన్‌లు 2026 మొదటి నెలల్లో వస్తాయని గతంలో నివేదికలు ఉన్నాయి. కానీ ఆపిల్ ఈ ప్రత్యేకమైన ఫోన్‌ను 2027 మొదటి త్రైమాసికంలో విడుదల చేయవచ్చు. అయితే రేజర్ 40, రేజర్ 40 అల్ట్రాతో మోటరోలా ఇప్పుడు మార్కెట్‌లోకి ప్రవేశించింది.