న్యూఢిల్లీ: పనితీరులోనూ, మిడ్ రేంజ్ బెస్ట్ స్మార్ట్ ఫోన్లలోనూ నోకియా 8.1 ఒకటిగా నిలిచింది. పెర్ఫార్మెన్స్‌లోనూ, డిజైన్‌లోనూ మెరుగైన ఫోన్‌గా ఇది నిలిచింది. దీని లాంచింగ్ ధర రూ.27,999గా నిర్ణయించారు. కానీ దీనిపై నోకియా మేనేజ్మెంట్ రూ.15,999 భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఇది నోకియా ఆన్‌లైన్ స్టోర్‌లో కొనుగోలు చేసిన వారికి మాత్రమే లభిస్తుంది. 

గతేడాది డిసెంబర్ నెలలో నోకియా 8.1 స్మార్ ఫోన్ ఆవిష్కరించింది. దీని ధర రూ.26,999గా ఖరారైంది. ఈ హ్యాండ్ సెట్ ధర పలు దఫాలు తగ్గుతూ వచ్చింది. తాజాగా 4జీబీ ప్లస్ 64జీబీ ర్యామ్ వేరియంట్ ఫోన్ ధర రూ. 15,999లకు అందుబాటులో ఉంది. 6జీబీ ర్యామ్ వేరియంట్ ఫోన్ ధర రూ.22,999లకే వినియోగదారులకు లభించనున్నది. 

నోకియా 8.1 ఫోన్‌లో 6.18-అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ (2246×1080 పిక్సెల్స్) డిస్ ప్లే ఉంటుంది. 2.5డీ కర్వ్డ్ గ్లాస్ తోపాటు ఐపీఎస్ ఎల్ఈడీ ప్యానెల్ ఫీచర్ అమర్చారు. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 710 ఎస్వోసీ విత్ అడ్రెనో 616 జీపీయూ కలిగి ఉంటుంది. 

ఆన్ బోర్డ్ స్టోరేజీతో నోకియా 8.1 ఫోన్ 4జీబీ ప్లస్ 64 జీబీ, 6 జీబీ ప్లస్ 128 జీబీ సామర్థ్యం ఈ ఫోన్ సొంతం. ఈ రెండు ఫోన్లు కూడా మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్‌తో 400 జీబీ ర్యామ్ వరకు విస్తరించే ఆప్షన్ కలిగి ఉన్నాయి. ఫ్రంట్ 12 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్, 13 మెగా పిక్సెల్ సెకండరీ సెన్సర్‌తో డ్యుయల్ కెమెరా కలిగి ఉంటుంది. 20 ఎంపీ కెమెరా కూడా ఇందులో ఉంది. 

నోకియా 8.1 ఫోన్‌లో ఇంకా ఆండ్రాయిడ్ 9 పై డ్యూయల్ సిమ్ కార్డ్ స్లాట్స్, బ్లూ టూత్, 4జీ ఎల్టీఈ విత్ ఓల్టే, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, 3500 ఎంఎహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ, 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సౌకర్యం కలిగి ఉంటుందీ ఫోన్.