Asianet News TeluguAsianet News Telugu

రూ. 52 లక్షలకు తొలి ఐఫోన్ వేలం.. ఇందులో అసలు ఏం స్పెషాలిటీ ఉందో తెలుసా..

40 డాలర్లు అంటే దాదాపు 52 లక్షల రూపాయలకు తొలి ఐఫోన్ వేలం వేయబడింది. మొదటి ఐఫోన్ 2023 వింటర్ ప్రీమియర్ వేలంలో వేలం వేయబడింది. ఈ వేలం 2/2/2023 నుండి 2/19/2023 వరకు కొనసాగింది.

The first iPhone auctioned for Rs 52 lakh, it has only 2 megapixel camera-sak
Author
First Published Feb 22, 2023, 11:54 AM IST

ఐఫోన్‌కు ఉన్న క్రేజ్‌ అందరికీ తెలిసిందే. గతేడాది అక్టోబర్‌లో తొలి ఐఫోన్‌ను రూ.32 లక్షలకు వేలం వేశారు. అయితే మొదటి ఐఫోన్ 2007లో ప్రారంభించారు. ఆపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ చేత దీనిని ప్రారంభించబడింది. ఇప్పుడు 14 ఏళ్ల తర్వాత తొలి ఐఫోన్ రూ.52 లక్షలకు వేలంలో నిలిచింది. ఈ తొలి ఐఫోన్ స్పెషాలిటీ ఏంటి, రూ.52 లక్షలతో తొలి ఐఫోన్‌ను కొనుగోలు చేసిన వ్యక్తి గురించి తెలుసుకోండి...

40 డాలర్లు అంటే దాదాపు 52 లక్షల రూపాయలకు తొలి ఐఫోన్ వేలం వేయబడింది. మొదటి ఐఫోన్ 2023 వింటర్ ప్రీమియర్ వేలంలో వేలం వేయబడింది. ఈ వేలం 2/2/2023 నుండి 2/19/2023 వరకు కొనసాగింది.

కరెన్ గ్రీన్ అనే వ్యక్తి ఈ 14 ఏళ్ల తొలి ఐఫోన్ యజమాని. కరెన్ గ్రీన్ USAలోని న్యూజెర్సీలో కాస్మెటిక్ టాటూ ఆర్టిస్ట్. అతనికి ఈ ఐఫోన్ బహుమతిగా వచ్చింది. వేలం సందర్భంగా, 'మేము మొదటి ఐఫోన్‌ను మంచి కండిషన్ లో సీలు చేస్తున్నాము. మా ఆఫర్‌ను ఫోన్  యజమాని కరెన్ గ్రీన్ పంపారు."

అయితే ఇప్పుడు దాని ఒప్పందం ముగిసింది. అతిపెద్ద విషయం ఏమిటంటే, ఐఫోన్ అసలు యజమాని కరెన్ గ్రీన్ వేలం సమయంలో హాజరుకాలేదు, అయితే కరెన్ గ్రీన్ టాటూ స్టూడియో కోసం ఈ డబ్బును ఉపయోగిస్తానని చెప్పారు.
   
ఈ ఐఫోన్ టచ్‌ సపోర్ట్‌తో పాటు కెమెరాతో ప్రారంభించబడింది. ఈ 2007 ఐఫోన్ లో వెబ్ బ్రౌజింగ్ కూడా ఉంది. మొదటి ఐఫోన్ కి 3.5-అంగుళాల డిస్ ప్లే, 2-మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఈ ఐఫోన్‌లో టచ్ ఐడితో కూడిన హోమ్ బటన్ కూడా ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios