Asianet News TeluguAsianet News Telugu

11జి‌బి ర్యామ్, గొప్ప కెమెరాతో తక్కువ ధరకే టెక్నో స్పార్క్ స్మార్ట్ ఫోన్.. బిగ్ బ్యాటరితో వచ్చేసింది..

టెక్నో స్పార్క్ 9 ఇన్ఫినిటీ బ్లాక్, స్కై మిర్రర్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. టెక్నో స్పార్క్ 9ని ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్‌గా లాంచ్ చేసారు. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.9,499.

Tecno Spark 9 launch, 11 GB RAM and great camera will be available at a low price
Author
Hyderabad, First Published Jul 18, 2022, 2:59 PM IST

చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ టెక్నో  కొత్త స్మార్ట్‌ఫోన్ టెక్నో స్పార్క్ 9ని సోమవారం ఇండియాలో లాంచ్ చేసింది. Tecno Spark 9 అనేది ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్, దీనిని రూ. 9,499 ప్రారంభ ధరతో ప్రవేశపెట్టారు. ఈ ఫోన్‌లో 6.6-అంగుళాల HD ప్లస్ డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్, 5,000mAh బ్యాటరీ, 13-మెగాపిక్సెల్ ప్రైమరీ లెన్స్ ఉంది. ఈ ఫోన్‌లో 11 జీబీ వరకు ర్యామ్ అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ ఇతర స్పెసిఫికేషన్స్, ధర అండ్ ఫీచర్ల గురించి తెలుసుకుందాం...

Tecno Spark 9 ధర
Tecno Spark 9 ఇన్ఫినిటీ బ్లాక్, స్కై మిర్రర్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. టెక్నో స్పార్క్ 9  ఎంట్రీ లెవెల్  స్మార్ట్‌ఫోన్‌గా లాంచ్ చేయబడింది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.9,499. ఈ ఫోన్‌ను జూలై 23 నుండి ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ నుండి కొనుగోలు చేయవచ్చు. ప్రైమ్ డే సేల్ కింద అమెజాన్ దీని సేల్స్ ప్రారంభిస్తుంది.   

టెక్నో స్పార్క్ 9  స్పెసిఫికేషన్లు 
Tecno Spark 9 Android 12 ఆధారిత HiOS 8.6తో వస్తుంది అలాగే ఆక్టాకోర్ MediaTek Helio G37 ప్రాసెసర్ ద్వారా ఆధారితమైనది, అంటే 12nm ఆధారంగా పనిచేస్తుంది. ఈ ఫోన్ 6.6-అంగుళాల HD+ డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్ అండ్ (1600 x 720 పిక్సెల్‌లు) రిజల్యూషన్‌తో వస్తుంది. ఈ ఫోన్ ముందు భాగంలో వాటర్ డ్రాప్ నాచ్ డిస్‌ప్లే కనిపిస్తుంది. Tecno Spark 9 6జి‌బి  ర్యామ్ తో 128 జి‌బి స్టోరేజ్ ఉంది, దీనిని మైక్రో HD కార్డ్ సహాయంతో 512 జి‌బి వరకు పెంచుకోవచ్చు. ర్యామ్ ప్లస్ ఫీచర్‌ల సహాయంతో ఫోన్ ర్యామ్ ని 11 జి‌బి (6 జి‌బి ఫిజికల్ ర్యామ్ + 5 జి‌బి వర్చువల్ ర్యామ్)కి పెంచవచ్చు. 

టెక్నో స్పార్క్ 9 కెమెరా
టెక్నో 13-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సార్ అండ్ మరొక AI లెన్స్‌తో  Tecno Spark 9లో డ్యూయల్ కెమెరా సెటప్‌ను అందిస్తుంది. ఈ ఫోన్‌లో LED ఫ్లాష్ లైట్ కూడా  ఉంది. 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది, F / 2.0 ఎపర్చర్‌తో వస్తుంది. 

టెక్నో స్పార్క్ 9 బ్యాటరీ
Tecno Spark 9లో 5,000mAh బ్యాటరీ ఉంది. కనెక్టివిటీ గురించి మాట్లాడితే ఈ ఫోన్‌లో 3.5mm ఆడియో జాక్, ఎఫ్‌ఎం రేడియో, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 802.11 ac, బ్లూటూత్ 5, USB టైప్ C పోర్ట్, GPS వంటి ఫీచర్లు ఉన్నాయి. ఫోన్‌  వెనుక భాగంలో ఫింగర్‌ప్రింట్ రీడర్ కూడా అందించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios