Asianet News TeluguAsianet News Telugu

కలర్స్ మార్చే టెక్నో మోస్ట్ స్టైలిష్ ఫోన్.. ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే నెల రోజుల వరకు..

ఈ ఫోన్ ఇతర ఫీచర్ల గురించి మాట్లాడితే 120Hz రిఫ్రెష్ రేట్‌తో డిస్‌ప్లే అంతేకాకుండా MediaTek Helio G96 ప్రాసెసర్‌, మూడు బ్యాక్ కెమెరాలతో పరిచయం చేసారు, దీనిలో ప్రైమరీ లెన్స్ 64 మెగాపిక్సెల్ RGBW + (G+P) లెన్స్.

Tecno most stylish phone launched battery will last for 37 days in single charging
Author
First Published Sep 16, 2022, 12:32 PM IST

చైనా మొబైల్ తయారీ సంస్థ టెక్నో అత్యంత స్టైలిష్ స్మార్ట్‌ఫోన్‌ను భారతీయ మార్కెట్‌లో విడుదల చేసింది. దీని పేరు టెక్నో కామోన్ 19 ప్రొ మాండ్రియన్ ఎడిషన్. టెక్నో కామోన్ 19 ప్రొ మాండ్రియన్ కలర్ మారే బ్యాక్ ప్యానెల్‌తో వస్తుంది. ఈ ఫోన్ ఇతర ఫీచర్ల గురించి మాట్లాడితే 120Hz రిఫ్రెష్ రేట్‌తో డిస్‌ప్లే అంతేకాకుండా MediaTek Helio G96 ప్రాసెసర్‌, మూడు బ్యాక్ కెమెరాలతో పరిచయం చేసారు, దీనిలో ప్రైమరీ లెన్స్ 64 మెగాపిక్సెల్ RGBW + (G+P) లెన్స్.

  ధర
టెక్నో కామోన్ 19 ప్రొ మాండ్రియన్ ఎడిషన్ ధర రూ.17,999. ఈ ఫోన్ సింగిల్ వేరియంట్ 8జి‌బి ర్యామ్, 128జి‌బి స్టోరేజ్‌తో వస్తుంది. అమెజాన్ లో సెప్టెంబర్ 22 నుండి ఈ స్మార్ట్ ఫోన్ సేల్స్ ఉంటాయి. అలాగే ఎస్‌బి‌ఐ బ్యాంక్ కార్డులపై 10 శాతం తగ్గింపు లభిస్తుంది. ఈ ఫోన్‌ను స్కై, సైబర్‌పంక్ ఇంకా డ్రీమీ కలర్‌లో కొనుగోలు చేయవచ్చు.

స్పెసిఫికేషన్‌లు
టెక్నో కామోన్ 19 ప్రొ మాండ్రియన్ ఎడిషన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.8-అంగుళాల ఐ‌పి‌ఎస్ ఎల్‌సి‌డి ఫుల్ HD+ డిస్‌ప్లే, MediaTek Helio G96 ప్రాసెసర్, 8జి‌బి LPDDR4x ర్యామ్‌తో 128 జి‌బి స్టోరేజ్ అందించారు.

5జి‌బి వరకు వర్చువల్ ర్యామ్‌ను కూడా పొందుతుంది. ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 12తో HiOS 8.6 ఉంది. ఫోన్ బ్యాక్ ప్యానెల్ పాలిక్రోమాటిక్ ఫోటోఐసోమర్ టెక్నాలజీతో వస్తుంది, దీని సహాయంతో ఫోన్ బ్యాక్ ప్యానెల్ లైట్ ఉన్నప్పుడు రంగును మారుస్తుంది.

కెమెరా
ఈ ఫోన్ కి మూడు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి, దీనిలో ప్రైమరీ లెన్స్ 64 మెగాపిక్సెల్‌, దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) కూడా ఉంది. ఫోన్‌లోని రెండవ లెన్స్ 50-మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ మోడ్, మూడవ లెన్స్ 2-మెగాపిక్సెల్ మాక్రో లెన్స్. టెక్నో ఈ ఫోన్ కి 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చింది.

బ్యాటరీ
ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీ లభిస్తుంది. బ్యాటరీకి సంబంధించి 124 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ ఇంకా వన్-టైమ్ ఛార్జింగ్ తర్వాత 37 రోజుల స్టాండ్‌బై క్లెయిమ్ చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios