Tecno Camon 19 series: ఆకర్షణీయమైన స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను లాంచ్ చేసిన టెక్నో..!
న్యూయార్క్‌లోని రాక్‌ఫెల్లర్ సెంటర్‌లో జరిగిన ఈవెంట్‌లో Tecno మొబైల్ కంపెనీ తమ బ్రాండ్ నుంచి Camon 19 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను పరిచయం చేసింది. మొత్తం నాలుగు స్మార్ట్‌ఫోన్ మోడల్స్ ను కంపెనీ విడుదల చేసింది. ఆ వివరాలివే..!
మొబైల్ తయారీదారు ట్రాన్షన్ టెక్నో సరికొత్తగా Camon 19 సిరీస్‌ని పరిచయం చేసింది. ఇందులో భాగంగా కెమాన్ 19, కెమాన్ 19 నియో, కెమాన్ 19 ప్రో అలాగే కెమాన్ 19 ప్రో 5G అనే నాలుగు వేరియంట్లను కంపెనీ ఆవిష్కరించింది. స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.ఈ సిరీస్‌లోని అన్ని ఫోన్లు ఫుల్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటాయి. అంతేకాకుండా స్క్రీన్ మీద ఫింగర్ ప్రింట్ మరకలు పడకుండా యాంటీ ఫింగర్ ప్రింట్ కోటింగ్ ఉంటుంది.
ఈ సిరీస్‌లోని Tecno Camon 19 Pro మోడల్ 64 MP RGBW సెన్సార్‌తో వచ్చిన ప్రపంచంలోనే మొదటి ఫోన్. ఇంకా ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి? ధర ఎంత మొదలగు వివరాలను ఇక్కడ చూడవచ్చు.
Tecno Camon 19 Pro స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్
- 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.8 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే
- 8GB RAM, 128 GB/ 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
- మీడియాటెక్ Helio G96 ప్రాసెసర్
- వెనకవైపు 64+50+2 మెగా పిక్సెల్ కెమెరా, ముందు భాగంలో 32 MP సెల్ఫీ షూటర్
- ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
- 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 33W ఛార్జర్
Tecno Camon 19 స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్
- 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.8 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే90
- 6GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
- మీడియాటెక్ Helio G85 ప్రాసెసర్
- వెనకవైపు 64 మెగా పిక్సెల్ కెమెరా, ముందు భాగంలో 16 MP సెల్ఫీ షూటర్
- ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
- 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 18W ఛార్జర్
- నియో మోడల్ కూడా దాదాపు ఇవే ఫీచర్లు కలిగి ఉంటాయి. అయితే కెమెరా విషయానికి వస్తే వెనక వైపు 48 మెగాపిక్సెల్, ముందు వైపు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో ఇచ్చారు. Camon 19 సిరీస్ ధరలు సుమారు రూ. 18,500 నుంచి ప్రారంభమవుతున్నాయి. త్వరలోనే అన్ని దేశాల మార్కెట్లలో తమ ఫోన్లను విడుదల చేయనున్నట్లు సమాచారం. అప్పుడు ధరలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.