గత కొన్ని రోజులుగా WhatsApp ఎన్నో కొత్త కొత్త ఫీచర్లను పరీక్షించింది. ఇప్పుడు WhatsApp మరొక కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది, దిని తర్వాత మీ మెసేజెస్ పై మీకు పూర్తి కంట్రోల్  ఉంటుంది. అయితే ఈ ఫీచర్ గురించి తెలుసుకుందాం... 

మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ WhatsApp ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లపై పని చేస్తోంది. గత కొన్ని రోజులుగా, WhatsApp ఎన్నో కొత్త ఫీచర్లను పరీక్షించింది. ఇప్పుడు WhatsApp మరొక కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది, దింతో మీ మెసేజెస్ పై మీకు పూర్తి కంట్రోల్ ఉంటుంది. అయితే ఈ ఫీచర్ ఏంటో దాని గురించి తెలుసుకుందాం...

WhatsApp ఇప్పుడు లింక్ ప్రివ్యూ ఫీచర్‌పై పని చేస్తోంది. ఈ ఫీచర్ వచ్చిన తర్వాత మీరు ఎవరితోనైనా షేర్ చేస్తున్న లింక్ ప్రివ్యూ కనిపించాలా వద్దా అనేది మీరు మాత్రమే నిర్ణయించగలరు. రాబోయే ఈ కొత్త ఫీచర్ వాట్సాప్ ప్రైవసీ ఫీచర్‌లో భాగం.

ప్రస్తుతం బీటా వినియోగదారుల కోసం కొత్త ఫీచర్‌ను విడుదల చేశారు. మీరు కూడా బీటా వినియోగదారులు అయితే, మీరు Google Play Store నుండి మీ యాప్‌ను అప్ డేట్ చేయవచ్చు. WhatsApp Android బీటా వెర్షన్ 2.24.7.12లో ఈ కొత్త ఫీచర్ కనిపించింది.

ప్రస్తుతం మీరు ఎవరితోనైనా వెబ్ లింక్‌ను షేర్ చేస్తే, దాని ప్రివ్యూ కనిపిస్తుంది. మెటా డిస్క్రిప్షన్ అండ్ టైటిల్ ఈ ప్రివ్యూలో కనిపిస్తాయి. దీని కారణంగా, వెబ్ లింక్ గురించి చాలా సమాచారం ఇప్పటికే అందుబాటులో ఉంది, కానీ కొన్నిసార్లు ఈ సమాచారం కూడా తప్పుదారి పట్టించేవి. వాట్సాప్ ఇప్పుడు దాన్ని షట్ డౌన్ చేయబోతోంది.