Tata Neu:టాటా సూపర్ యాప్ అంటే ఏంటి.. ఎలా పనిచేస్తుంది.. ?

మీరు గూగుల్ ప్లే స్టోర్ నుండి టాటా న్యూ యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ 105ఎం‌బి ఉంటుంది. ఈ యాప్ ఆపిల్ యాప్ స్టోర్‌లో కూడా అందుబాటులో ఉంది.

Tata Neu: How is this Tata super app, what will be the work, know everything

టాటా గ్రూప్ టాటా న్యూ(Tata Neu) యాప్‌ను విడుదల చేసింది. టాటా గ్రూప్‌కి చెందిన ఈ యాప్‌ను భారతదేశపు మొట్టమొదటి సూపర్ యాప్‌గా పిలుస్తున్నారు. మీరు గూగుల్ ప్లే స్టోర్ నుండి Tata Neu యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ సైజ్ 105ఎం‌బి. 
లాంచ్ అయినప్పటి నుంచి 10 లక్షల మందికి పైగా ఈ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకున్నారు. టాటా న్యూ యాప్‌ను టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ప్రారంభించారు. టాటా న్యూ యాప్‌ ద్వారా షాపింగ్‌ నుంచి మెడికల్‌, ట్రావెల్‌ వరకు పనులను సింపుల్ గా, సులభంగా  చేయనున్నట్టు ఆవిష్కరణ సమయంలో అన్నారు. భారతదేశపు మొట్టమొదటి సూపర్ యాప్ టాటా న్యూ గురించి వివరంగా తెలుసుకుందాం...

భారతదేశపు మొట్టమొదటి సూపర్ యాప్ టాటా న్యూ ఎలా ఉంటుంది ?
టాటా న్యూ ఆండ్రాయిడ్, iOS ప్లాట్‌ఫారమ్‌ల కోసం ప్రారంభించారు. ఈ యాప్ భారతదేశపు మొట్టమొదటి సూపర్ యాప్‌గా చెప్పబడుతోంది. ఈ యాప్‌తో మీరు టాటా గ్రూప్‌కు చెందిన అన్నీ వెంచర్‌ల సేవలను తెలుసుకోవచ్చు. ఈ ఒక యాప్‌తో మీరు Air Asia, Air India, Vistaara విమాన టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు, ఇంకా BigBasket నుండి కిరాణా, కూరగాయలను కొనుగోలు చేయవచ్చు. మీరు క్రోమా నుండి అన్ని రకాల వస్తువులను కూడా ఆర్డర్ చేయవచ్చు.

అంతేకాకుండా, మీరు Tata Neu యాప్ నుండి IHCL, Cummin, Starbucks, Tata 1 MG, Tata Cliq, Tata Play, Westside సేవలను కూడా పొందవచ్చు. Tata 1 MGతో మీరు ఇంట్లో కూర్చొని అన్ని రకాల మందులు, మెడికల్ వస్తువులను ఆర్డర్ చేయవచ్చు. టైటాన్, తనిష్క్, టాటా మోటార్స్ సేవలను కూడా త్వరలో ఈ యాప్‌కి జోడించనున్నారు. Tata Neu UPI నుండి క్యాష్, క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ వరకు అన్ని రకాల పేమెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మొత్తంమీద, Tata Neu యాప్‌తో, మీరు మేడిసిన్స్ నుండి కిరాణా సామాగ్రి వరకు, విమాన టిక్కెట్‌లను బుక్ చేసుకోవడం నుండి నగల వరకు ప్రతిది కొనుగోలు చేయవచ్చు. 

టాటా న్యూ ప్రత్యేక ఫీచర్లు
NeuCoins- టాటా గ్రూప్  ఈ నియో యాప్ ద్వారా షాపింగ్ చేసే కస్టమర్లు NeuCoinsని పొందుతారు. ఒక NeuCoins అంటే 1 రూపాయి. NeuCoins సంపాదించడానికి పరిమితి లేదు. మీరు నిరంతరం షాపింగ్ చేయడం ద్వారా ఆన్ లిమిటెడ్ NeuCoins సంపాదించవచ్చు. మీరు మీ షాపింగ్‌లో NeuCoinsని ఉపయోగించుకోవచ్చు.

NeuPass - NeuPass ప్రస్తుతం యాప్‌లో అందుబాటులో లేదు. NeuPass అనేది రాబోయే ప్రత్యేక మెంబర్ షిప్  సర్వీస్. ఇందుకోసం కస్టమర్లు సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. NeuPass ప్రయోజనం ఏమిటంటే, ప్రతి కొనుగోలుపై కస్టమర్‌లు కనీసం 5% అదనపు NeuCoinsని పొందుతారు.

స్టోరీస్ - Tata Neu యాప్‌లో స్టోరీస్ సర్వీస్ కూడా ఉంది, దీనిలో కస్టమర్‌లు డిజిటల్ మ్యాగజైన్‌లను చదివే అవకాశాన్ని పొందుతారు. లైఫ్ స్టయిల్, ఫ్యాషన్‌కి సంబంధించిన స్టోరీస్, వీడియోలను వీక్షించవచ్చు ఇంకా చదవవచ్చు. మీరు ఇందులో కొన్ని ప్రధాన పబ్లికేషన్స్ నుండి స్టోరీస్ కూడా కనుగొంటారు. ఇందులో హైక్వాలిటీ కంటెంట్ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.

సూపర్ యాప్ అంటే ఏమిటి?
సూపర్ యాప్స్ అంటే మీకు అవసరమైన అన్ని పనులను చేయగల, ఇంకా మీకు కావల్సిన అన్ని వస్తువులను పొందగల యాప్. 2020లో భారతదేశంలో నిషేధించబడిన WeChat ఆఫ్ చైనా పేరు మీరు తప్పక వినే ఉంటారు. WeChat మల్టీమీడియా మెసేజింగ్ యాప్‌గా ప్రారంభమై ఉండవచ్చు కానీ నేడు ఈ యాప్ సూపర్ యాప్‌గా మారింది. మెటా యాజమాన్యంలోని  వాట్సాప్ కూడా ఇప్పుడు అదే బాటలో నడుస్తోంది. WeChatలో పేమెంట్ నుండి షాపింగ్, క్యాబ్‌ల వరకు అన్నీ సేవలు అందుబాటులో ఉన్నాయి. చాలా సులభమైన భాషలో చెప్పాలంటే సూపర్ యాప్ ఒక మాల్. సూపర్ యాప్‌లు సాధారణంగా ఎన్నో రకాల సేవలు ఉన్న ఒక కంపెనీచే తయారు చేయబడతాయి.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios