అయితే, నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ (Reliance Jio's new Netflix subscription plan) మొదటిసారి ప్రీపెయిడ్ ప్లాన్‌లతో అందుబాటులో ఉంది. దింతో జియో   40 కోట్లకు పైగా ప్రీపెయిడ్ కస్టమర్లు నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో ప్లాన్‌ను సెలెక్ట్ చేసుకునే  అవకాశం ఉంటుంది. 

టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ప్రీపెయిడ్ మొబైల్ కస్టమర్ల కోసం నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో రెండు ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. జియో రూ. 1,099 ప్లాన్‌తో కస్టమర్‌లు ఇప్పుడు రోజుకు 2GB డేటాను పొందుతారని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 

ఇదిలా ఉంటే, రూ.1,499 ప్లాన్‌తో కంపెనీ రోజుకు 3GB డేటాను అందిస్తుంది. రెండు ప్లాన్‌లు 84 రోజుల వాలిడిటీ ఉంటుంది. రూ. 1,499 ప్లాన్‌తో నెట్‌ఫ్లిక్స్ టీవీ లేదా ల్యాప్‌టాప్ వంటి ఏదైనా పెద్ద స్క్రీన్‌లో స్ట్రీమ్ చేయవచ్చు. సెలెక్టెడ్ జియో పోస్ట్‌పెయిడ్ ఇంకా జియో ఫైబర్ ప్లాన్‌లతో నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ఇప్పటికే అందుబాటులో ఉంది.

అయితే, నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ (Reliance Jio's new Netflix subscription plan) మొదటిసారి ప్రీపెయిడ్ ప్లాన్‌లతో అందుబాటులో ఉంది. దింతో జియో 40 కోట్లకు పైగా ప్రీపెయిడ్ కస్టమర్లు నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో ప్లాన్‌ను సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది.

జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) కిరణ్ థామస్ ఒక ప్రకటనలో, 'మా కస్టమర్‌లకు ప్రపంచ స్థాయి సేవలను అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము. నెట్‌ఫ్లిక్స్‌తో ప్రీపెయిడ్ ప్లాన్ (రిలయన్స్ జియో కొత్త నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్) మా నిబద్ధతను నిరూపించుకోవడానికి మరో అడుగు అని అన్నారు. 

నెట్‌ఫ్లిక్స్‌లోని APAC పార్టనర్‌షిప్‌ల వైస్ ప్రెసిడెంట్ టోనీ జామ్‌కోవ్స్కీ మాట్లాడుతూ, “గత కొన్ని సంవత్సరాలుగా, మేము భారతదేశం అంతటా ప్రేక్షకులు ఇష్టపడే అనేక విజయవంతమైన షోస్, డాక్యుమెంటరీలు, సినిమాలను ప్రారంభించాము. జియోతో మా కొత్త భాగస్వామ్యం వినియోగదారులకు భారతీయ కంటెంట్ ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంటెంట్‌కు యాక్సెస్‌ను అందిస్తుంది, ”అని ఆయన అన్నారు.